ఈ నెల 30న జరిగే 'తెలంగాణ మార్చ్'కు బీజేపీ కాపలా ఉంటుందని, ఎలాంటి విధ్వంసం జరగకుండా చూస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పోలీసులు, ప్రభుత్వం తమ కవ్వింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. అరెస్టులు, అడ్డుకోవడాలతో మార్చ్‌ను గందరగోళంలోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం ర్టీ కార్యాలయంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, టి.రాజేశ్వర్‌రావు, కె.రాములు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ఇప్పటికే జిల్లాల్లో పోలీసులు తెలంగాణ ఉద్యమకారులు, బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మతహింస చెలరేగుతుందని, విధ్వంసం జరుగుతుందని, సీమాంధ్ర ప్రజలపై దాడులు జరుగుతాయంటూ ప్రభుత్వం, పోలీసులు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒక పక్క ఇలాంటి దుష్ప్రచారాన్ని సాగిస్తూనే మరో పక్క మార్చ్‌ను వాయిదా వేసుకోవాలంటూ సర్కారు సన్నాయి నొక్కులు నొక్కుతోందని ధ్వజమెత్తారు. నిజానికి ఎలాంటి విధ్వంసకర పరిస్థితులు తలెత్తవని, పోలీసులు అత్యుత్సాహంతో ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.తెలంగాణ ప్రజలుగాని, సీమాంధ్ర ప్రజలుగాని భయపడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి దాడులకు ఆస్కారం లేదని భరోసా ఇచ్చారు. ఇలాంటి చర్యలకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని ప్రకటించారు. తమ పార్టీ నేతలంతా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుని, మార్చ్ ప్రశాంతంగా జరిగేలా చూస్తారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30లోపు ఏదైనా సానుకూల ప్రకటన చేస్తేనే మార్చ్‌ను వాయిదా వేసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ మంత్రులకు ఏదైనా అలజడి ప్రారంభమైతేనే తెలంగాణ అంశం గుర్తుకు వస్తుందని.. వారివన్నీ మీటింగులు, ఈటింగులే తప్ప సాధించిందేమీ లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more