Woman tied to tree and attaked by man

Woman Tied to Tree and Attaked by Man, Chandra Kanth, Naidu

Woman Tied to Tree and Attaked by Man

Woman.gif

Posted: 09/28/2012 11:14 AM IST
Woman tied to tree and attaked by man

Woman Tied to Tree and Attaked by Man

లింగ వివక్షతో అణగారిన వర్గంగా బతుకీడుస్తున్న స్త్రీజాతి మృగాళ్ల ఇనుప పాదాల కింద మరింత నలిగిపోతోంది. కామ పిచాచుల తీరని దాహానికి ఆనాదిగా అబలలు బలవుతూనే ఉన్నారు. ఆధునిక కాలంలోనూ ఆటవిక సంస్కృతి సాగుతుండడం దారుణం. సమాచార, సాంకేతిక రంగం శిఖరస్థాయికి చేరిందని చెప్పుకుంటున్న నేటి కాలంలోనూ కాంతల మానప్రాణాలు గాల్లో దీపాలవడం దారుణం కాక మరేమిటి? రామాయణం నుంచి రోబో కాలం వరకు రాక్షస సంతతి చెలామణి అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో మగాడితో సమానంగా మగువ దూసుకుపోతోందని ఆధునికవాదుల ‘దంచుడు’పై అనుమానపు దృక్కులు సహజం.సమానత్వం మాట అటుంచితే మగువ మనుగడకే ముప్పు ఏర్పడిందన్న భయాందోళన సమాజంలో రావడానికి మగాడే కారణమంటే ఒప్పుకోవాల్సిందే. నాటి నుంచి నేటి వరకు ఆడదాన్ని ఆటబొమ్మను చేసి ఆడుకుంటున్న పురుషాహంకారులదే ఈ పాపం. ప్రాచీన కాలం నుంచి ‘ఫేస్‌బుక్’ తరం వరకు పురుషాగ్నిలో తరుణిలు తగలబడిపోతున్న పరిస్థితుల్లో మార్పు రాకపోవడమే పురోభివృద్ధికి తార్కాణమా అంటే తలలు దించుకోవాల్సిందే. మగాడు మారడా? తన ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి పడుతులను ‘పాడు’చేయడం మానడా? ఆఖరికి శత్రువును దెబ్బకొట్టాలన్నా స్త్రీనే చెరబట్టడం వదలడా? దాహమేసినప్పుడు నీళ్లు తాగాలి కాని, నెత్తురు కాదు. కోరిక సహజం. కోరిక తీర్చుకోవడానికి కొట్టడమే అకృత్యం. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కాశీపురంలో ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డాడో మగపశువు.

Woman Tied to Tree and Attaked by Man

కోరిక తీర్చలేదన్న కసికి తోడు తన అహంపై దెబ్బకొట్టిందన్న అక్కసుతో చంద్రకాంత్ నాయుడుఅనే పురుషాహంకారి ఓ పేద పడతి(30)పై బుసలు కొట్టాడు. నగ్నంగా చెట్టుకు కట్టేసి కసితీరా హింసించాడు. బాధితురాలిపై కన్నేసిన నాయుడుఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి చెరచబోయాడు. నిరుపేద అయిన నీతి కలది కావడంతో నీతిబాహ్య పనికి తెగబడ్డ చంద్రకాంత్ చెంపను చెప్పుతో చెళ్లుమనిపించింది. దీంతో మరింత రెచ్చిపోయిన ‘కీచక’ నాయుడు తన పరివారంతో కలిసి ఆమెను చెట్టుకు కట్టేశాడు. వివస్త్రను చేసి విచక్షణా రహితంగా హింసించాడు. అందరూ చోద్యం చూశారే కాని ఏ ఒక్కరూ ఆమెను విడిపించడానికి సాహసించలేదు. చిక్కుల్లో ఉన్న సాటి ఆడదాన్ని కాపాడడానికి కనీసం మహిళలు కూడా ముందుకు రాకపోవడం మరింత విషాదం. చివరకు భర్తే ఆమెను విడిపించుకున్నాడు.

Woman Tied to Tree and Attaked by Man

బాధితురాలి ఫిర్యాదు మేరకు కామాంధుడికి రాయదుర్గం ఖాకీలు బేడీలు బిగించారు. అయితే వృద్ధురాలైన అతని తల్లి చనిపోవడంతో తాత్కాలికంగా వదిలేశారు. మహిళే అతడికి విముక్తి ప్రసాదించింది. అలాంటి స్త్రీ జాతిని నవ్వులు పాల్జేశాడు చంద్రకాంత్. అతడికి శిక్ష పడినా పోయిన బాధితురాలి పరువు తిరిగొస్తుందా? చోద్యం చూసినవారంతా ప్రతిఘటించివుంటే ఆమె జీవితం నవ్వులపాలు కాకుండా నిలిచేది. కళ్ల ముందు అకృత్యం పేట్రేగిపోతున్నా ఆపేందుకు కనీసం ప్రయత్నించకపోవడమే మనమింకా ఆటవిక కాలంలోనే ఉన్నామనడానికి నిదర్శనం. ఈ పరిస్థితిలో మార్పు రానంతకాలం మనం అనాగరికులమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp accuses centre of diluting telangana march
Minister sridhar babu comments on kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles