Sushma swaraj as pm candidate

Sushma Swara,PM candidate,Shiv Sena chief Bal Thackeray

Sushma Swaraj is Bal Thackeray's only choice for PM from BJP

Sushma.gif

Posted: 09/26/2012 03:31 PM IST
Sushma swaraj as pm candidate

Sushma Swaraj is Bal Thackeray's only choice for PM from BJP

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తి సుష్మా స్వరాజ్ అని శివసేన పార్టీ అధినేత బాల్‌థాక్రే అభిప్రాయపడ్డారు. సుష్మా స్వరాజ్ చాలా తెలివైన, చురుకైన మహిళని ప్రశసించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అందరికీ ఆమోదయోగ్యం అవుతుందన్నారు.శివసేన పత్రిక 'సామ్నా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాల్‌థాక్రే ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. బీజేపీ నుంచి తదుపరి ప్రధాని ఎవరని ప్రశ్నించగా.. ప్రధాని అభ్యర్థిగా సుష్మా స్వరాజ్ అయితే బాగుంటుందని చాలా సార్లు చెప్పానని థాక్రే సమాధానమిచ్చారు. ఆమె గొప్పగా పని చేస్తారని చెప్పారు.

శివసేన అధినేత నుంచి ఈ తరహా అభిప్రాయం వెలువడిన మరుక్షణమే ఆయన నివాసమైన బంద్రాలోని మాతోశ్రీకి వెళ్లి థాక్రేతో సుష్మా స్వరాజ్ సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను బాలాసాహెబ్‌ థాక్రేతో పాటు.. ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రేను కలిసినట్టు చెప్పారు. ఈ మధ్య వీరిద్దరు అనారోగ్యానికి గురయ్యారని, కేవలం మర్యాదనిమిత్తమే వారిని కలిసినట్టు సుష్మా స్వరాజ్ చెప్పారు. కాగా, ఎన్డీయే కూటమిలో శివసేన అత్యంత కీలకంగా ఉన్న విషయం తెల్సిందే. గతంలో అటల్ బీహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీయే కూటమి బలంగా ఉండేదని, ప్రస్తుతం ఆ కూటమి నాయకత్వ బలహీనంతో కొట్టుమిట్టాడుతోందని బాల్‌థాక్రే అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan bail cbi court
Rupee appreciation to cap gold prices  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles