Chiru and renuka likely to be included in central cabinet

Chiru and Renuka likely to be included in central cabinet

Chiru and Renuka likely to be included in central cabinet

Chiru and Renuka likely to be included in central cabinet.png

Posted: 09/13/2012 10:33 PM IST
Chiru and renuka likely to be included in central cabinet

Chiru_renukaపార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తలు ఎప్పడి నుండో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్నటి మొన్నటి నుండి ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గం నుండి కొందరిని తొలగించి కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు. అదే గనుక జరిగితే మన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి అవకాశం కల్సించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎప్పటి నుండో చిరంజీవిని ఊరిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. మొన్నామధ్యన పీసీసీ పదవి వద్దని ఖరాఖండిగా చెప్పిన చిరుకు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చితంగా చోటు కల్పిస్తారని అంటున్నారు. ఇక మిగతా రాష్ట్రాల నుండి మనీష్ తివారీ, మీనాక్షి నటరాజన్, జ్యోతి మీర్ధా, మాణిక్య ఠాగూర్‌లకు కూడా చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుత మంత్రులైన ఆస్కార్ ఫెర్నాండెజ్, కె.రెహ్మాన్ ఖాను‌లను కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. మరోవైపు.. సల్మాన్ ఖుర్షీద్‌ను మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించి కేవలం న్యాయ శాఖకే పరిమితం చేసే సూచనలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case against teachers as school student dies after punishment
Laxmi parvathi lashes at chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles