Potential habitable exoplanet found around a red dwarf star

Exoplanet, Red dwarf, HARPS telescope

Astronomers have discovered a new super-earth in the habitable zone around the red dwarf star Gliese 163

Potential habitable exoplanet found around a red dwarf star.png

Posted: 09/07/2012 06:13 PM IST
Potential habitable exoplanet found around a red dwarf star

Super-earthఅనంత విశ్వంలో.. మన భూగోళానికి అల్లంత దూరాన.. 49 కాంతి సంవత్సరాల ఆవల.. జీవం మనుగడ సాగించగలిగే వాతావరణం ఉన్న ప్రాంతంలో (హ్యాబిటబుల్ జోన్) భూమి లాంటి గ్రహాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అక్కడి డోరాడో నక్షత్రమండలంలోని ఒక అరుణ కుబ్జ నక్షత్రం చుట్టూ 26 రోజులకొక ప్రదక్షిణం చేస్తున్న ఆ 'సూపర్-ఎర్త్'కి గ్లీసీ 163 సీ అనే పేరు పెట్టారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీలోని హార్ప్స్ టెలిస్కోపును ఉపయోగించి శాస్త్రజ్ఞులు ఈ గ్రహాన్ని గుర్తించారు.

సాధారణంగా.. ఏదైనా గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంటే.. అక్కడ వాతావరణం మన సౌరమండలంలో బుధుడిలాగా భరించలేనంత వేడిగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉండే గ్రహాల్లో వాతావరణం మన సౌరవ్యవస్థలో నెఫ్ట్యూన్‌లాగా భరించలేనంత చల్లగా ఉంటుంది. అటు దూరమూ.. ఇటు దగ్గరా కాకుండా.. సూర్యుడి నుంచి ఉండాల్సినంత దూరంలో ఉండి.. తగినంత ఉష్ణోగ్రత, వాతావరణం ఉండే భూమిలాంటి గ్రహాల్లో మాత్రమే జీవం మనుగడ సాధ్యమవుతుంది.

ఇలాంటి ప్రదేశాలను హ్యాబిటబుల్ జోన్ అంటారు. ఈ తరహా జోన్ల కోసం నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహా పలు అంతరిక్ష సంస్థల శాస్త్రజ్ఞులు టెలిస్కోపులు వేసి మరీ వెదుకుతున్నారు. అలా వెలుగుచూసిందే ఈ గ్లీసీ 163సీ. "ఈ గ్రహం వ్యాసార్ధం మన భూమికన్నా 1.8 నుంచి 2.4 రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. అక్కడున్నది రాళ్లా లేక నీరా అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది'' అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Turkish soldiers killed in blast
No petrol price hike now jaipal reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles