Sri lanka advises its citizens to avoid tamil nadu

India, Sri Lanka Ties Hurt by Violence,Sri Lanka advises its citizens to avoid Tamil Nadu,Diplomacy, foreign affairs, India, Jayalalithaa, South Asia, Sri Lanka, Tamil Nadu

India, Sri Lanka Ties Hurt by Violence

India.gif

Posted: 09/05/2012 01:20 PM IST
Sri lanka advises its citizens to avoid tamil nadu

India, Sri Lanka Ties Hurt by Violence

తమిళనాడులో శ్రీలంక యాత్రికులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నందున ఎవరూ భారత్ వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. దక్షిణ భారత్‌లో పర్యటిస్తున్న లంక పౌరులను భయభ్రాంతులకు గురిచేసే సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడులో జరిగిన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో 184 మంది యాత్రికులు ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగివచ్చినట్టు శ్రీలంక విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత్‌లో పర్యటించే లంక పౌరులను ఉద్దేశించి హెచ్చరిక చేసింది. ‘తమిళనాడులో లంక పర్యాటకులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రంగా గర్హిస్తున్నాం. సాంస్కృతిక ఉత్సవాలకు హాజరవుతున్న పౌరులను, వివిధ రంగాల్లో శిక్షణ నిమిత్తం వెళ్తున్న వారికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడులో ఉన్న లంక పర్యాటకులు చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హైకమిషన్‌కు సమాచారం అందించాలని లంక విజ్ఞప్తి చేసింది. ఇలాఉండగా తమిళనాడులో ఉన్న లంక పౌరులందరూ క్షేమంగానే ఉన్నారని చెన్నైలోని లంక డిప్యూటీ హైకమిషన్ అధికారి ఎ. రాజకరుణ తెలిపారు. చెన్నైలోని మహాబోధి సొసైటీ కార్యాలయాలకు ప్రత్యేక భద్రత కల్పించినట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లంక రక్షణ శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం పట్ల కేంద్రానికి నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న శ్రీలంక ఫుట్‌బాల్ టీమ్ స్వదేశానికి వెళ్లిపోవల్సిందిగా ఆమె ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yashoda hospital doctor kidnapped
Anti obama film a box office hit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles