7 year old not sleeping on sambaiaha

7 year old not sleeping on sambaiaha, warangal , chityala , chilumula sambaiah, GopiNadth Reddy

7 year old not sleeping on sambaiaha

sambaiaha.gif

Posted: 09/03/2012 04:24 PM IST
7 year old not sleeping on sambaiaha

7 year old not sleeping

ఒకరోజు నిద్ర లేకుంటేనే ఒళ్లు, కళ్లు తిరిగి పడిపోతారు. కానీ ఆ వ్యక్తికి ఏకంగా ఏడున్న రేళ్ల నుంచి కంటిమీద కునుకు లేదు. వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేటకు చెందిన చిలుముల సాంబయ్య. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఏవీ లేని ఇతనికి 2005 ఫిబ్రవరి 17 నుంచి నిద్రపట్టడం లేదు. కంటిమీద కునుకు కరువైంది. దీంతో అతడు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని మనోవైద్యనిపుణుడు గోపీనాథ్ వద్ద కౌన్సెలింగ్ తీసుకున్నాడు. న్యూరో సర్జన్లు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ తిరుమల్‌రావు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శామ్యూల్ వద్ద చికిత్స పొందడంతో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. అయినా అతడికి నిద్రమాత్రం పట్టడం లేదు. రూ. 80 వేల వరకు అప్పు తెచ్చి వైద్య పరీక్షలు చేసుకున్నట్లు సాంబయ్య తెలిపారు.

హిప్నో పద్మ కమలాకర్ రాసిన పాజిటివ్ థింకింగ్, నిత్య జీవితంలో యోగా పుస్తకాలు చదివి, యోగ చేసినా మార్పురావడం లేదని వాపోయాడు. అలాగే వాస్తు నిపుణులు, చివరకు భూత వైద్యులను కూడా ఆశ్రయించినట్లు చెప్పాడు. 2,753 రాత్రులు జాగారమే చేశానని వెల్లడించాడు. డబ్బు లు లేక కుటుంబ పోషణ భారమై రెండేళ్ల నుంచి వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదన్నాడు. మానవతావాదులు స్పందించి వైద్య పరీక్షల కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నాడు.మానసిక ఆందోళన వల్లే నిద్ర పట్టకపోవడమనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఏడాది క్రితం మా దగ్గరకు వచ్చిన సాంబయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చాం. న్యూరో సర్జన్‌కు చూపించుకుని మందులు వాడమని చెప్పాం. ఇలాంటి సమస్య ఉన్న వారికి కుటుంబసభ్యులే వెన్నంటి ఉంటూ మానసిక స్థయిర్యం కల్పించాలి. వారు మందులు సక్రమంగా వాడేలా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yerrannaidu questioned to chief minister
Jharkhand mla strips off shirt in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles