Guntur collector suresh kumar visit government hospital

guntur collector suresh kumar visit government hospital,Government General Hospital, Guntur

guntur collector suresh kumar visit government hospital

collector.gif

Posted: 08/30/2012 04:02 PM IST
Guntur collector suresh kumar visit government hospital

guntur collector suresh kumar visit government hospital

 అది గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి. వైద్యులు ఒక్కొక్కరూ తాపీగా విధులకు వస్తున్నారు. వచ్చినవారు వచ్చినట్లే షాక్ అవుతున్నారు. తల వంచుకుని లోపలకు వెళ్లిపోతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 34 మంది పరిస్థితి ఇంతే! ఎందుకంటారా... వారు సంతకాలు చేయాల్సిన హాజరు పట్టీవద్ద ఒక వ్యక్తి నిల్చుని ఉన్నారు. అప్పటికే ఆలస్యంగా వచ్చినందుకు వారందరికీ ఆబ్సెంట్ మార్క్‌చేసేశారు.ఆయనెవరో కాదు.. సాక్షాత్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్. ఆలస్యంగా వచ్చిన ఏడుగురు ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరైనట్లు ఆయన స్వయంగా హాజరుపట్టీలో నమోదు చేశారు. వీరందరికీ మెమో జారీచేసి వివరణ కోరాలని వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సూర్యకుమారిని ఆదేశించారు. ఇకపై ఉదయం 9:30 తర్వాత వైద్యుల హాజరు పట్టీని బీరువాలో పెట్టేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.హమ్మయ్య.. కలెక్టర్ వచ్చి వెళ్లిపోయారు, తుపాను వెలిసినట్లుందని మధ్యాహ్నం ఒంటిగంటకల్లా వైద్యులు ఊపిరి పీల్చుకుందామని బయటపడ్డారు. కార్లలో అలా గేటుదాకా వెళ్లారో లేదో.. మళ్లీ వారికి షాక్!! గేటు దగ్గరే కలెక్టర్ కాపుకాసి కనిపించారు. కార్లను ఆపి, వైద్యులను బయటకు పిలిచారు. "ఏమ్మా! ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1:10 గంటలు. అప్పుడే లంచ్ ఏమిటమ్మా!! లంచ్ తర్వాత మరలా ఆస్పత్రికి వస్తావా?'' అంటూ ఓ లేడీడాక్టర్‌ను నిలదీశారు.

గేటు దగ్గర వ్యవహారం చూసిన మిగిలిన వైద్యులు కార్లు ఎక్కకుండానే మళ్లీ లోపల తమ వార్డుల్లోకి వెళ్లిపోయారు. సాయంత్రం 4 గంటలకు విధులు ముగించుకొని వెళ్లే సమయంలో కూడా వైద్యులంతా తప్పనిసరిగా ఎగ్జిట్ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని కలెక్టర్ సురేష్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సుల హాజరు వివరాలను ఇకపై ప్రతి రోజూ ఉదయం పది గంటలకు ఈ-మెయిల్ ద్వారా తనకు పంపాలని హెచ్‌డీఎస్ చైర్మన్ హోదాలో సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్లను ఆయన ఆదేశించారు. మధ్యమధ్యలో తాను తనిఖీ చేస్తానని చెప్పారు. వైద్యులకు త్వరలో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెడతామని, అప్పటివరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ నర్సుల హాజరు పట్టీని పరిశీలించారు. మొత్తం 28 మంది సెలవుల్లో ఉన్నారని.. ఒక నర్సు విధులకు ఆలస్యంగా వచ్చారని నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత తెలిపారు. ఉదయం 8:30 గంటల తర్వాత హాజరు పట్టీని అందుబాటులో ఉంచొద్దని, ఆలస్యంగా వచ్చిన స్టాఫ్ నర్సుల వివరణ కోరాలని కలెక్టర్ ఆదేశించారు. వీరికి కూడా మూడు షిఫ్టుల్లో ఎగ్జిట్ రిజిస్టర్లను నిర్వహించాలని పేర్కొన్నారు. నర్సులు విధుల్లో సమయపాలన కచ్చితంగా పాటిస్తారని పుష్పలత చెప్పగా, "అలా అని గ్యారంటీ ఏమిటీ, మీరు రాసిస్తారా?'' అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maya lady mangamma bank loans
Two helicopters crash midair in gujarat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles