State to lease aircraft for kiran

State to lease aircraft for Kiran, VIP travel, DGCA new guidelines, Andhra pradesh Chief Minister, N. Kiran kumar Reddy, 14 crore, Aircraft,

State to lease aircraft for Kiran

Kiran.gif

Posted: 08/28/2012 03:42 PM IST
State to lease aircraft for kiran

State to lease aircraft for Kiran

కరెంట్‌ సంక్షోభానికి పొదుపే మంత్రం అంటూ ప్రజలకు సుద్దులు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం...తనదాకా వచ్చేసరికి జాన్తా నై అంటోంది. కోట్లు పెట్టి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఓ విమానాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసింది.కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక జనం గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఒక్కొటొక్కటిగా మూత బడుతున్నాయి. కళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు నిలువుగా కుంగిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్న ప్రభుత్వం...కరెంట్‌ సంక్షోభానికి పొదుపే మంత్రం అంటోంది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం...ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోసం రాష్ట్ర ఖజానాపై కోట్ల రూపాయల భారం మోపేందుకు అంతా సిద్ధం చేసింది. ఆయనకోసం కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేయాలని డిసైడైపోయింది.

నిజానికి అంతకుముందు ఏకంగా 100 కోట్లకు పైగా ఖరీదయ్యే కొత్త విమానాన్ని సిఎం కోసం కొందామనుకుంది. అయితే అది ఖరీదైన వ్యవహారం కావడంతో వెనుకంజ వేసింది. విమాన, సిబ్బంది ఖర్చులను భరించడం తమ వల్ల కాదని అనుకుంది. అందుకే ఇప్పుడు లీజు కింద ఆయనకు విమానాన్ని సమకూర్చబోతోంది. అదే జరిగితే రాష్ట్ర ఖజానాకు దాదాపు 14 కోట్ల రూపాయల భారం పడుతుంది. రాష్ట్ర ఆధీనంలో వున్న విమానం ఏడాది మెయింటెనెన్స్‌ కంటే ఇది ఎక్కువ. ఇందిరమ్మ బాటలో భాగంగా రాష్ట్రమంతటా కొనసాగే సిఎం పర్యటనను దృష్టిలో వుంచుకుని విమానాన్ని లీజుకు తీసుకుందామని నిర్ణయించామని, దాన్ని నెలకు 30 నుంచి 40 గంటలపాటు ఉపయోగిస్తామని ఒక సీనియర్‌ అధికారి చెప్పారు. అయితే లీజుకు తీసుకున్నా రాష్ట్ర ఖజానాపై భారం పడక తప్పదు. ఎందుకంటే...నియమనిబంధనల ప్రకారం విమానం ఎంత చిన్నదైనా ఇద్దరు పైలెట్లు, ఒక ఆపరేషన్‌ మేనేజర్‌, సేఫ్టీ మేనేజర్‌, ఫ్లయిట్‌ డిస్పాచర్‌, ఒక క్యాబిన్‌ అటెండెంట్‌ వుండి తీరాలి. అదీ సిఎం విమానం సంగతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandhi in cbse affiliated schools
Nannapaneni rajakumari protest on assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles