Si wife agitation in hyderabad

si wife agitation in hyderabad

si wife agitation in hyderabad

43.gif

Posted: 08/26/2012 08:14 PM IST
Si wife agitation in hyderabad

      తన భర్త మరో యువతితో అక్రమ సంబంధం నెరపుతున్నాడని ఆరోపిస్తూ ఓ ఎస్ఐ భార్య ఆందోళనకు దిగింది. ఈ సంఘటన si_wifeహైదరాబాదులోని మీర్‌పేటలో జరిగింది. బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా పని చేస్తున్న తన భర్త వెంకట్ రెడ్డి మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడని, వారిపై చర్యలు తీసుకోవాలని సదరు ఎస్ఐ భార్య ధర్నాకు దిగింది. మరో యువతితో వెంకట్ రెడ్డి ఉండటం చూసిన మొదటి భార్య, ఆమె బంధువులు ఆ యువతిపై దాడికి యత్నించారు. తన భర్త బేగం బజార్‌లో ఎస్ఐగా పని చేస్తారని, ఆయన కొంతకాలంగా మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, దీనిని తాను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని మొదటి భార్య చెప్పారు.
      అయితే ఇది అబద్దమని, తాను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్ఐ చెబుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు అంటున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wife suicide for her husband
Ysr congress party appeal for bundh participation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles