High command accept dharmana resignation

ongress high command, M Kiran kumar Reddy, Dharmana Prasad Rao, Ponnala Laxmaiah, Kanna Laxminarayana, sabitha Indra Reddy anf Geetha Reddy

It is said that Congress high command has directed CM Kiran kumar Reddy to accept Dharmana Prasad Rao's resignation and also remove four members Ponnala Laxmaiah, Kanna Laxminarayana, sabitha Indra Reddy anf Geetha Reddy from cabinet.

High command accept Dharmana resignation.png

Posted: 08/24/2012 06:07 PM IST
High command accept dharmana resignation

Dharmanaకడప పార్లమెంటు ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రులకు ఉద్వాసన పలకాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే ఇరుక్కున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు పై సీబీఐ ఛార్జిషీటు ధాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజీనామా పత్రం సమర్పించి ఆమోదం కోసం చూస్తున్న ధర్మాన రాజీనామాతో పాటు మరో నలుగురు మంత్రులను సాగనంపమని అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించింది. ఇవాళ సోనియాగాంధీతో 1.20 నిమిషాల పాటు సమావేశం అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధినేత్రి ఈ సూచనలు చేసినట్లు సమాచారం.

సోనియాతో జరిగిన సమావేశానికి అక్కడే ఉన్న పీసీసీ ఛీఫ్ బొత్సను ఆహానించలేదు. ఇక ధర్మాన రాజీనామా లేఖను కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కి వచ్చిన తరువాత గవర్నర్ కి పంపే అవకాశాలు ఉన్నాయి. ఈ లేఖ తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణల లేఖలను కూడా గవర్నర్ కి పంపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారం రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police officers issue warning to harish rao
Sc gives clean chit to chidambaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles