Dharmana prasada rao resignation will be accepted

Dharmana Prasada rao, CM kiran kumar reddy, Sonia Gandhi, Manmohan singh, Gulamnabhi Azad, Hammad Patel, congress high command.

It is said that Congress high command suggested CM Kiran kumar Reddy to accept Dharmana Prasad Rao's resignation. Kiran kumar has met Sonia Gandhi's political advisor Ahmed Patel last night

Dharmana Prasada rao resignation will be accepted.png

Posted: 08/24/2012 10:12 AM IST
Dharmana prasada rao resignation will be accepted

Dharmana-prasada-raoఅధిష్టానం పిలుపు మేరకు ఆఘమేఘాల మీద నిన్న ఉదయం ఢిల్లీకి వెళ్ళిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులతో బిజీబిజీగా గడిపారు. ఢిల్లీకి చేరుకున్న తరువాత చిదంబరం, ఆంటోనీలతో అరగంట చొప్పున సమావేశం అయ్యారు. రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో గంటన్నరపాటు, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు రాజీనామా పై చర్చ జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఆమోదానికే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లను కలవనున్నారు.

ధర్మాన పై వేటు వేస్తే కేబినెట్ లో ఉన్న మిగతా మంత్రుల పై కూడా వేటు వేయాల్సి వస్తుందని, అలా చేస్తే పార్టీ ప్రతిష్ట మనస బారుతుందని అందుకే రాజీనామా విషయంలో నిర్ణయం ఆలస్యమైందని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించినట్లు సమాచారం. కేబినెట్ లో కొందరు మంత్రులు ధర్మానా రాజీనామాను ఆమోదించ వద్దని ఇప్పటికే కేంద్రంలో పెద్దలకు సూచించారు. దీని పై కూడా వారు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ సోనియా, ప్రధానిల భేటి అనంతరం ధర్మాన రాజీనామా విషయం తేలుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa out
Mega star meets powerful women sonia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles