Kurnool boy tarun sai in new zealand cricket team

Kurnool boy Tarun Sai in New Zealand cricket team

Kurnool boy Tarun Sai in New Zealand cricket team

Tarun.gif

Posted: 08/21/2012 04:28 PM IST
Kurnool boy tarun sai in new zealand cricket team

Kurnool boy Tarun Sai in New Zealand cricket team

ఏ క్రికెటర్‌కైనా టెస్టులు ఆడటం కల. న్యూజిలాండ్ ఆటగాడు తరుణ్ నేతుల దీనికి మినహాయింపు కాదు. ఐదు వన్డేలు ఆడినా... టెస్టుల్లో ఆడే అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడీ లెగ్‌స్పిన్నర్. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో జట్టుకి ఎంపికైనా ఆడే అవకాశం రాలేదు. కానీ ప్రస్తుతం భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో మాత్రం అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఉపఖండం వికెట్లు స్పిన్నర్లకు అనుకూలించడం, జట్టులో వెటోరీ లేకపోవడం వల్ల తరుణ్... హైదరాబాద్ టెస్టులో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే తన కల నెరవేరినట్లే. ఎవరో న్యూజిలాండ్ ఆటగాడు మన దగ్గర అరంగేట్రం చేస్తే అది విశేషం కాకపోవచ్చు. కానీ అతడు తెలుగోడైతే... అది కూడా హైదరాబాద్‌లో అండర్-13 స్థాయి క్రికెట్ ఆడిన ఆటగాడైతే కచ్చితంగా విశేషమే. కర్నూలులో జన్మించిన తరుణ్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. క్రికెట్ అంటే ఆసక్తితో చిన్నప్పుడే బంతి పట్టి... హైదరాబాద్ అండర్-13 జట్టుకి ఆడాడు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో తరుణ్ కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది. దీంతో అక్కడ ఆట కొనసాగించి... జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో క్రికెట్ ఆడే అవకాశం వచ్చినా... తన తండ్రి ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూస్తే బాగుండేదని తరుణ్ అంటున్నాడు.

మా నాన్న, గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరూ స్కూల్‌లో పని చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఇక్కడికి రావడానికి సమయం దొరకలేదు. నాన్న నివసించిన నగరంలో నేను క్రికెట్ ఆడటం చూస్తే తనకీ ఆనందంగా ఉండేది’ అని తరుణ్ చెప్పాడు. అయితే తరుణ్ తాత నగరంలోనే ఉన్నారట. తన అరంగేట్రాన్ని ఆయన ప్రత్యక్షంగా చూసినా చాలని ముచ్చటపడుతున్నాడు. భారత్‌తో న్యూజిలాండ్ ఆడుతున్నా... హైదరాబాద్‌లో పర్యాటక జట్టుకు మద్దతు దొరికే అవకాశం ఉందట. ‘హైదరాబాద్‌లో టెస్టు అరంగేట్రం చేసే అవకాశం వస్తే అది అద్భుతం. ఇక్కడ మా బంధువులు, కుటుంబ స్నేహితులు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను ఆడితే కివీస్ జట్టుకు కూడా మద్దతు దొరుకుతుంది’ అని తరుణ్ అన్నాడు. రెండు నెలల క్రితం కూడా ఈ స్పిన్నర్ ఒక వ్యక్తిగత పనిమీద నగరానికి వచ్చి వెళ్లాడు. ‘గతంలో చాలాసార్లు హైదరాబాద్ వచ్చినా... ఈసారి మ్యాచ్ ఆడటానికి రావడం ఆనందంగా ఉంది’ అని ‘సాక్షి’తో చెప్పాడు. ఏ స్పిన్నర్‌కైనా భారత జట్టును నిలువరించడం పెద్ద సవాల్. అయితే దీనికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్ ఆడటమే పెద్ద సవాల్. ఎవరితో ఆడినా రాణించడం ముఖ్యం. ఉత్తమ టెస్టు ఆటగాళ్లకు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా’ అని తరుణ్ అన్నాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటన తనకు కొంత అనుభవాన్నిచ్చింది. ‘వెస్టిండీస్ ఆటగాళ్లకు, భారత క్రికెటర్లకు తేడా ఉంది. విండీస్ ఆటగాళ్లు నేరుగా ఆడేందుకు చూస్తారు. భారత బ్యాట్స్‌మెన్ ఎక్కువగా స్వీప్ చేస్తారు. సరైన ప్రాంతాల్లో బంతులు విసరడమే కీలకం’ అని తరుణ్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hc cancels kurupam mla janardhan thatraj election
Aicc secretary k b krishnamurthy comments on cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles