Tada rtc bus murders psycho srinivasa rao

Nellore, Psycho, Bhardachalam, chennai. RTC Bus, Srinivasa rao, Tada, murdered, killer, 3 presons.

Nellore police have arrested the psychopath, who murdered three persons on a Bhadrachalam-Chennai RTC bus near the Tada checkpost in Nellore district in the early hours of July 26

Tada RTC Bus Murders psycho-Srinivasa rao.png

Posted: 08/20/2012 03:57 PM IST
Tada rtc bus murders psycho srinivasa rao

Srinivas-Raoభద్రాచలం నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు ప్రయాణికులను తడ వద్ద హతమార్చిన సైకో శ్రీనివాస రావును ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సంచలనం కోసమే ఈ హత్యలకు పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. మరి అతను ఎందుకు వాళ్ళని చంపాడు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పై ఎందుకు కక్ష్య తీర్చుకోవాలనుకున్నాడు.తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన శ్రీనివాసరావు విజయవాడలోని ఆదిత్య ఫార్మసీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, రెండేళ్ల పాప ఉన్నారు.

2009లో కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి భార్యభర్తలు విడిపోయారు. అనంతరం మనుబోలుకు చెందిన మరొక అమ్మాయితో పరిచయం పెంచుకుని వేధించగా, ఆమె బంధువులు మనుబోలు స్టేషన్‌లో కేసు పెట్టారు.దీంతో అప్పటి మనుబోలు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి విచారించి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటినుంచి అతడు ఎస్ఐపై కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వా త విజయవాడలో మరో అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆమె తన కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని చెప్పి.. విడిచిపెట్టి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తనను జైలుకు పంపడం వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని భావించి.. ఎలాగైనా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఎస్ఐపై కక్ష సాధించాలని.. ఓ కత్తి కొనుక్కుని దా నికి బాగా సాన పెట్టించాడు. దీంతో పాటు రక్తపు మ రకలు అంటినపుడు ఇబ్బంది ఉండకూడదని, మరో షర్టు తెచ్చుకుని దాన్ని నడుముకు చుట్టుకుని, అక్కడే కత్తి కూడా పెట్టుకున్నాడు. పైన మాములు షర్ట్ వేసుకున్నాడు. పనిచేసే సెల్‌ఫోన్లు ఇం ట్లో పెట్టేసి.. సిమ్‌కార్డు లేని సెల్‌ఫోన్‌ను అలారం పెట్టుకోడానికి వెంట తెచ్చుకున్నాడు.

విజయవాడ నుంచి ఒంగోలుకు వచ్చి.. భద్రాచలం నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు. తడకు బస్సు ఎన్ని గంటలకు వెళ్తుందని డ్రైవర్‌ను అడిగాడు. మూడున్నర, నాలుగు గంటల మధ్య వెళ్తుందని తెలిపాడు. దీంతో 3.40 గంటలకు అలారం పెట్టుకున్నాడు. అలారం శబ్దం పైకి రాకుండా వైబ్రేషన్‌లో ఉంచుకున్నాడు. బస్సులో వెనుక సీ ట్లో కూర్చొనేందుకు వెళ్తుండగా రమేష్ అనే వ్యక్తికి కాలు తగలగా.. ఆయన చిరాకు పడ్డాడు.దీంతో ముందుగా రమేష్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. తడ రాగానే అలారం మోగడంతో నిద్రలేచిన శ్రీనివాసరావు గాఢనిద్రలో ఉన్న రమేష్‌ను కత్తితో రెం డు పోట్లు పొడిచాడు. తర్వాత నిద్రలేచిన అజయ్ బిశ్వాస్‌ను, నిరంజన్‌ను పొడిచాడు. పారిపోతుండగా అడ్డుకున్న రాంబాబునూ పొడిచాడు. దీంతో అలజడి రేగడంతో తాపీ గా దిగి సూళ్లూరుపేట వైపు కాలినడకన వెళ్లాడు. దారిలో వెంట తెచ్చుకున్న చొక్కా వేసుకుని కత్తిని, రక్తపు మరకలు అంటిన చొక్కాను దాచుకున్నాడు.సూళ్లూరుపేటలో వ్యాన్ ఎక్కి గూడూరులో దిగి రైల్వేస్టేషన్ సమీపంలో పొదల్లో కత్తి, రక్తపు మరకలు అంటిన చొక్కా పడేశాడు. అక్కడ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో 26వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలో దిగేశాడు. అక్కడ నుంచి ఆదిత్య ఫార్మసీకి వెళ్లాడు.

ముందు రోజంతా కనపడలేదని మేనేజర్ తిట్టడంతో.. గూడూరులో పని ఉంటే వెళ్లానని కేరళ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చానని, చెమటలు కక్కుతూ చెప్పాడు.అప్పటినుంచి పేపర్లలో తడ సంఘటనపై వచ్చే కథనాలు చదివేవాడు. మధ్యమధ్యలో సంచలనం అంటే ఏంటో చూపిస్తానని, వెయిట్ అండ్ సీ అని ఎస్ఐకి మెసేజ్‌లు పంపాడు. వీ టిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 13,14 తేదీల్లో "సంచలనం సృష్టించాలంటే టైం రావాలి, వచ్చింది.. ఇంకా ఇబ్బంది పెడతా'' అంటూ ఎస్ఐ శ్రీనివాసరెడ్డికి మరోసారి ఎస్ఎంఎస్‌లను తన స్నేహితుడి ఫోన్ లోంచి పంపాడు.దీంతో.. పోలీసులు కూ పీ లాగి శ్రీనివాసరావు ఆచూకీ తెలుసుకున్నారు. శనివారం విజయవాడ సున్నపుబట్టీల సెంటర్‌లో పట్టుకుని విచారించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఒక ఎస్సై పై కక్ష్య తీర్చుకోవడానికి ముగ్గరి ప్రాణాలను బలి తీసుకున్న ఈ సైకోను వదిలి పెట్టవద్దని ప్రజలు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma writes open letter to chandrababu
Assange appeals to barack obama to end witch hunt against wikileaks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles