Congress high command nnouncement will be made on september 7

Congress high command is in a bid to make autonomous body for Telangana. It is said that an announcement will be made on September 7 in this regard

Congress high command is in a bid to make autonomous body for Telangana. It is said that an announcement will be made on September 7 in this regard

Congress high command nnouncement.png

Posted: 08/18/2012 08:36 PM IST
Congress high command nnouncement will be made on september 7

Sonia-Ghandiగత కొంత కాలంగా తెలంగాణ పై నాన్చుతూ వస్తున్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నికల తరువాత సెప్టెంబర్ లో ఏదో ఒక నిర్ణయాన్ని వెల్లడిస్తుందని గత కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ సమీపిస్తుండటంతో మళ్ళీ దీని పై వార్తలు బయలుదేరాయి. కాంగ్రెస్ అధిష్టానం దీని పై ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. లోక్ సభ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై ప్రకటన చేయవచ్చని, తెలంగాణకు గూర్ఖాలాండ్ నమూనానే ప్రయోగించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గూర్ఖాలాండ్ తరహాలో తెలంగాణకు స్వయం ప్రతిపత్తి మండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి మరొకరిని నియమించవచ్చని, తెలంగాణపైనే కాకుండా నాయకత్వ మార్పుపై ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకోసం సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అజాద్, వాయలార్ రవి, ఆంటోనిలతో కూడిన బృందం ఎపి వ్యవహారాలపై దృష్టి సారించింది.ఇందులో భాగంగా తెలంగాణను ఇక తేల్చాల్సిందేనన్న అభిప్రాయానికి హై కమాండ్ వచ్చిందని అంటున్నారు. మరి ఈసారైనా తేల్చుతుందో లేక మళ్ళీ నాన్చుతుందో తేలాంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New rule for train passengers
Cag crticism of delhi airports privatisation terms draw rebuttals from gmr civil aviation ministry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles