Ecuador grants asylum to wikileaks founder assange fearing eventual extradition to us

ECUADOR GRANTS ASYLUM TO WIKILEAKS FOUNDER ASSANGE, FEARING EVENTUAL EXTRADITION TO U.S.

ECUADOR GRANTS ASYLUM TO WIKILEAKS FOUNDER ASSANGE, FEARING EVENTUAL EXTRADITION TO U.S.

ECUADOR.gif

Posted: 08/18/2012 04:12 PM IST
Ecuador grants asylum to wikileaks founder assange fearing eventual extradition to us

ECUADOR GRANTS ASYLUM TO WIKILEAKS FOUNDER ASSANGE, FEARING EVENTUAL EXTRADITION TO U.S.

ప్రపంచం నలుమూలల్లోని మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు ఈక్వెడార్‌ను ఘనంగా కొనియాడుతున్నారు. పెద్ద ప్రజస్వామ్య దేశాలు చేయలేని సాహసాన్ని చిన్న దేశమైన ఈక్వెడార్ చేసిందని, భావప్రకటన స్వేచ్ఛను తన రెక్కల కింద పొదువుకుని సాటి దేశాలకు ఆదర్శంగా నిలిచిందని జేజేలు పలుకుతున్నారు. అమెరికా సైనిక, దౌత్యరహస్యాలను బట్టబయలు చేసిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే(41)కు రాజకీయ ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఈక్వెడార్ ప్రకటించడం తెలిసిందే. బ్రిటన్ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఈక్వెడార్ ఈ నిర్ణయం తీసుకుంది.అత్యాచార ఆరోపణల కేసులో స్వీడన్‌కు అప్పగింతను ఎదుర్కొంటున్న అసాంజేకు ఎందుకు ఆశ్రయం కల్పిస్తున్నామో తడబాటు లేకుండా వివరించింది. దీంతో బ్రిటన్ గుర్రుమంది. అయితే అసాంజే బ్రిటన్ నుంచి క్షేమంగా బయటకెళ్లేందుకు ఆ దేశం అనుమతించేంతవరకు ఆయన లండన్‌లోని తమ ఎంబసీలోనే ఉంటారని ఈక్వెడార్ అధ్యక్షుడు కొరెయా తేల్చి చెప్పారు. గొప్ప దేశాలు చేయలేని పెద్ద పనిని దక్షిణ అమెరికా ఖండంలోని బుల్లి దేశమైన ఈక్వెడార్ ఎందుకు చేసింది? అసాంజేకు ఈక్వెడార్ తన దేశంలో ఆశ్రయం కల్పించడం సాధ్యమేనా? వీటి గురించే ఈ కథనం.

ECUADOR GRANTS ASYLUM TO WIKILEAKS FOUNDER ASSANGE, FEARING EVENTUAL EXTRADITION TO U.S.

 ఈక్వెడార్ స్వతంత్ర వైఖరి: ఈక్వెడార్ అంతర్జాతీయ వ్యవహారాల్లో నిర్భయంగా వ్యవహరిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. ఇటీవల తమ దేశంలోని అమెరికా సైనిక స్థావరం లీజును రద్దు చేసింది. అమెరికాలో తమ దేశానికి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తేనే లీజును కొనసాగిస్తామని ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరెయా తెగేసి చెప్పారు. అసాంజే వ్యవహారంలో బ్రిటన్ బెదిరింపులకు ఈక్వెడార్ గట్టిగా బదులిచ్చింది. ‘మమ్మల్ని బెదిరించడానికి మాది వలస దేశం కాదు’ అని ముఖమ్మీద గుద్ది చెప్పింది.అసాంజేకు ఈక్వెడార్ ఆశ్రయమివ్వడానికి ఆయనతో ఈక్వెడార్ అధ్యక్షుడు కొరెయాకు ఇటీవల ఏర్పడిన పరిచయం, ‘స్నేహం’ కారణం కావొచ్చని విశ్లేషకుల భావన. ఆశ్రయం కోరడానికి ముందు వికీలీక్స్ అధినేత.. కొరెయాను ఇంట ర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా స్నేహం చిగురించి ఉండొ చ్చు. వామపక్ష అధినేత అయిన కొరెయాకు సహజంగానే అసాంజేపై అభిమానమేర్పడి ఉండొచ్చు. తన కొడుక్కి ఆశ్రయమివ్వాలని అసాంజే తల్లి క్రిస్టిన్ ఇటీవల కొరెయాను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.ఈక్వెడార్ పోలీసు వ్యవస్థ అవినీతిమయమని అమెరికా దౌత్యాధికారులు విమర్శించినట్లు వికీలీక్స్ బయటపెట్టిన అమెరికా పత్రాల్లో ఉంది. దీంతో ఈక్వెడార్‌లోని అమెరికా రాయబారిని కొరెయా అక్కడి నుంచి పంపేశారు. వికీలీక్స్ ఇచ్చిన సమాచారం ఈక్వెడార్‌కు ఉపయోగపడి ఉండొచ్చు. అసాంజే 2010 ఆగస్టులో తమపై అత్యాచారానికి పాల్పడినట్టు ఇద్దరు స్వీడన్ మహిళలు కేసు పెట్టారు. అయితే వారి అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నానని అసాంజే చెబుతున్నారు. విచారణ కోసం అసాంజేను అప్పగించాలని స్వీడన్ బ్రిటన్‌ను కోరింది.

ECUADOR GRANTS ASYLUM TO WIKILEAKS FOUNDER ASSANGE, FEARING EVENTUAL EXTRADITION TO U.S.

ఆయనను స్వీడన్‌కు అప్పగించాల్సిందేనని బ్రిటన్ సుప్రీం కోర్టు గత జూన్‌లో ఆదేశించింది. దీంతో అసాంజే ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నారు. అసాంజేను అమెరికాకు అప్పగించబోమని స్వీడన్, బ్రిటన్‌లు ఎలాంటీ హామీ ఇవ్వడం లేదు. ఆయనను అమెరికాకు అప్పగిస్తే నిష్పాక్షిక విచారణ జరగదు. జైలుశిక్ష లేదా మరణశిక్ష విధించొచ్చు. అందుకే మేం ఆయనకు ఆశ్రయమిస్తున్నాం’ అని ఈక్వెడార్ తెలిపింది. రక్షణ కోరుతూ తమను శరణువేడిన వారికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పింది.ఈక్వెడార్ అసాంజేకు ఆశ్రమివ్వడంపై కన్నెర్రజేస్తున్న బ్రిటన్ తీరుపై రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ కూడా గతంలో పలువురు విదేశీయులకు రాజ కీయ ఆశ్రయం కల్పించిన సంగతిని గుర్తుచేస్తున్నారు. రష్యా నేత పుతిన్‌ను విమర్శించిన వ్యాపార దిగ్గజం బోరిస్ బెరెజోవిస్కీ, రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ మాజీ అధికారి లిత్వినెంకో తదితరులకు బ్రిటన్ ఆశ్రయమిచ్చింది. వారిని తమకు అప్పగించాలని రష్యా చేసిన విజ్ఞప్తిని బుట్టదాఖలు చేసింది. ఈక్వెడార్ ఎంబసీలో ఉన్న అసాంజేను ఈక్వెడార్‌కు ఎలా తీసుకెళ్తారనేది ఆసక్తికరం. ఎంబసీ బయట మోహరించిన బ్రిటన్ పోలీసుల బారి నుంచి తప్పించుకుని ఆయన విమానంలో, లేదా నౌకలో ఈక్వెడార్‌కు వెళ్లడం దాదాపు అసాధ్యం. కానీ ఆయన మద్దతుదారులు ఆయనను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోతే రాజకీయ ఆశ్రయం ప్రతీకాత్మకంగా, ఆదర్శంగా మాత్రమే మిగులుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cag crticism of delhi airports privatisation terms draw rebuttals from gmr civil aviation ministry
Women filmed using spycams in bedrooms bathrooms  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles