ఇప్పుడు ఎక్కడ చూసిన సీసీ కెమేరాలు రాజ్యం వేలుతున్నాయి. ఈ సీసీ కెమేరాల వలన ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందని ప్రజలు అంటున్నారు. ఇదీ ముఖ్యంగా ఆడవారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ బుల్లి కెమేరాలతో ఆడవారి రహస్య ప్రదేశాలను బట్టబయలు చేస్తున్నారు. మహాత్మాగాంధీ కలలు కన్నట్టుగా అర్థరాత్రి మహిళలు నడి వీదిలో తిరగడం సంగతి దేముడెరుగు. మహిళలకు ఇంట్లోనే స్వేచ్చగా తిరలేని కాలమిది. ఎందుకంటే ఎక్కడ ఏ కెమెరా ఉందోనని భయపడిపోతున్నారట. ఇటీవల మధురై లో జరిగిన సంఘటన. రహస్య కెమేరాలతో స్నానాల గదుల్లో రహస్యంగా చిత్రీకరణ చేస్తున్నారట. ఆ స్నానాల వీడియోలను అందిపుచ్చుకొని .. ఒకరికొకరు పంచుకోవటం చేసుకుంటున్నారట. తదుపరి నెట్ లోనూ పెట్టేస్తున్నారట. ఈ విధంగా ఇళ్లల్లో పడగ్గదుల్లో , స్నానాల గదుల్లోనూ రహస్యపు కెమేరాలు అమర్చిన ఐదురుగు యువకుల్లో నలుగుర్ని తమిళనాడు లోని మధురై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నాడు. వారు తీసిన సన్నివేశాలను , మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ , ఇతర సాంకేతికపరమైన వస్తుసామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇంతకీ ఈ గతి తప్పిన పని చేసింది మధురై జిల్లాలోని సమయనల్లూర్ సమీప గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరైతే .. తన భార్యను నగ్నంగా చిత్రించారని సమాచారం. గ్రామస్తుల మర్యాదను కాపాడటం కోసం గ్రామం పేరును పోలీసులు బహిర్గతం చేయలేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఇద్దరు యువతులు తమ మర్యాద పోయిందన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. మిగిలిన ఆడపడుచులు .. ఎటువంటి సన్నివేశాలు నెట్ లో ప్రసారం అవుతాయోనన్న ఆంధోళనతో ఉన్నారు. మొబైల్ లో ఈ సన్నివేశాలను చూస్తున్న యువకులను ప్రశ్నించడంతో ఈ నగ్న సత్యం బయటపడింది. పెద్దలు దండించడంతో తామెలా కెమేరాలు అమర్చిందీ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more