ఓ పదేళ్ల చిన్నారి ఆటలు ఆడుకుంటు లీనమైపోయింది. తన ఇంటి ముందు స్వేచ్చగా ఆ చిన్నారి ఆడుకుంటుంది. ఆ చిన్నారి చురుకుతనంతో ఒక నవ శిశువు కు ప్రాణం పోసింది. ఆ చిన్నారి పేరు సురక్ష్యా రోజులాగే తన ఇంటి ముందు ఆడుకుంటోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై అక్కడికి వచ్చి .. హడావుడిగా దగ్గర్లోనే ఉన్న ఖాళీ స్థలం వద్దకు వెళ్లి ఒక గుంట తీసి .. తమ వెంట తీసుకొచ్చిన చిన్న పాపను ఆ గుంటలో పూడ్చేసి .. అక్కడినుండి హడావుడిగా పారిపోయారు. ఈ విషయాన్ని అక్కడే ఆడుకుంటున్న సురక్ష్యా చూసింది. కానీ ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్లు అక్కడ ఏం చేశారు అనే ఆలోచన రావటంతో ఆ చిన్నారి అడుగులు ఆ గుంటవైపు నడిచాయి. ఇంతలో ఆ గుంట లోపలి నుంచి పాప ఏడుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సురక్ష్యా .. మెరుపు వేగంతో పరుగెత్తి కెళ్లి తన ఇంట్లో ఉన్న ఆ చిన్నారి నాన్నకు విషయం చెప్పింది. అతను వెంటనే ఆ గుంట దగ్గరకు చేరుకొని .. పాపను బయటకు తీసి .. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఆయన జిల్లా పరిషత్ సభ్యుడు అయిన సాయినాథ్ మోరే . ఇంతలో స్థానికులు రావడంతో మట్టికొట్టుకుపోయి కొన ఊపిరితో ఉన్న ఆడశిశువును స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. ఇప్పుడా పాపను నాసిక్ సివిల్ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ .. మెల్లగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more