Rick van beek runs triathlon carrying cerebral palsy daughter

Rick van Beek runs triathlon carrying cerebral palsy daughter,Van Beek and his wife Mary, have two other healthy children.

Rick van Beek runs triathlon carrying cerebral palsy daughter

Rick.gif

Posted: 08/17/2012 10:41 AM IST
Rick van beek runs triathlon carrying cerebral palsy daughter

Rick van Beek runs triathlon carrying cerebral palsy daughter

ఆ గ్రేట్ నాన్న పేరు రిక్‌వాన్ బీక్(39). అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటాడు. బోసి నవ్వులు చిందిస్తున్న ఈ అమ్మాయి పేరు మ్యాడిసన్(13). సెరెబ్రెల్ పాల్సీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మ్యాడిసన్ నడవ లేదు. మాట్లాడనూ లేదు. కానీ.. నాన్నను చూసినప్పుడల్లా.. నాన్న గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా ఆమె మనసులో ఒకే మాట మార్మోగుతుంది.. నాన్నా.. నువ్వు గ్రేట్ నాన్నా అని.. ఇంతకీ రిక్ గొప్పతనం ఏమిటి? ఎందుకతడు అంత గ్రేట్? సెరెబ్రెల్ పాల్సీ.. ఈ వ్యాధికి చికిత్స లేదు.. రోజులు గడిచేకొద్దీ చిక్కిశల్యమవుతూ.. ఏదో ఒకనాడు అకస్మాత్తుగా మరణించడమే. మ్యాడీకి రెండు నెలల వయసప్పుడు ఆమెకీ వ్యాధి ఉన్న విషయం బయటపడింది. ఆ రోజు రిక్ జీవితంలో అత్యంత దుర్దినం. ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. మ్యాడీ ఆరోగ్యం బాగుండాలని రిక్ దంపతులు దేవుడిని వేడుకోని రోజు లేదు. మ్యాడిసన్ పరిస్థితి పర్వాలేదు. అయితే.. ఎప్పుడేం జరుగుతోందో చెప్పలేం.. 2008లో ఓ రోజున.. మ్యాడీ అనుకోని పరిస్థితుల్లో ఓ మారథాన్‌లో పాల్గొనాల్సి వచ్చింది. తడబడుతూ నెమ్మదిగా పరుగెట్టినా.. కొంతసేపే పాల్గొన్నా.. ఆ రోజు ఆమె ముఖంలో వెయ్యి వోల్టుల కాంతి.. మారథాన్‌లో తాను వేసిన ప్రతి అడుగునూ ఆస్వాదించింది. ఎందుకంటే.. మ్యాడిసన్‌కు వివిధ ప్రదేశాలు తిరగమంటే ఇష్టం.. మారథాన్ అంటే మరింత ఇష్టం.. అంతే అదే రోజున రిక్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. మ్యాడీ ముఖంలో ఆ ఆనందాన్ని శాశ్వతం చేయాలనుకున్నాడు. ప్రాణాంతక వ్యాధితో ఆమె కదలలేని పరిస్థితి వచ్చినప్పుడు తాను ఆమె ‘నడక’ అవ్వాలనుకున్నాడు.

Rick van Beek runs triathlon carrying cerebral palsy daughter

ఇంతకీ ఏమిటా నిర్ణయం? తన కూతురి కోసం తన మ్యాడీ ముఖంలో ఆనందం చూడటం కోసం తానూ మారథాన్‌లలో పాల్గొనాలని రిక్ నిర్ణయించాడు. అది సాధ్యమా? కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తడమంటే మాటలా? అలవాటు లేదే.. ఏం చేయాలి? స్టామినా పెంపొందించుకోవడం కోసం చివరికి తనకెంతో ఇష్టమైన సిగరెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. కనీసం రెండు పెట్టెలు కాల్చనిదే.. రోజు ముగించని రిక్.. కేవలం మ్యాడీ కోసం మానేశాడు. రేసుల్లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకున్నాడు. అప్పట్నుంచి మ్యాడీ, రిక్‌లు మారథాన్‌లు, ట్రయథ్లాన్ (పరుగు, సైక్లింగ్, ఈత)లో పాల్గొంటూనే ఉన్నారు. కూతురు ముఖంలో ఆనం దం కోసం మ్యాడీని పట్టుకుని.. రిక్ పరుగెత్తుతూనే ఉన్నాడు. ఈత కొట్టేటప్పుడు.. ఆమెను ఇలా చిన్నపాటి పడవలో వేసుకుని.. దాని తాడు తన నడుముకు కట్టుకుని ఈదుతాడు. సైక్లింగ్ చేసేటప్పుడు చిన్నపాటి బండిలో ఆమెను ఉంచి.. సైకిల్ తొక్కుతాడు. కష్టం కదా.. అంటే మ్యాడీ కోసం అదెంత అంటాడు. తన కూతురి కోసం రిక్ చేస్తున్నదాన్ని చూసి అందరూ పెద్ద త్యాగధనుడు అంటూ పొగిడితే.. రిక్ ఏమంటాడో తెలుసా? ‘‘దీన్ని మీరు స్ఫూర్తి అనండి.. త్యాగమనండి.. ఇంకేదైనా అనండి.. నేను మాత్రం దీన్ని ‘ప్రేమ’ అంటాను. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మ్యాడీ నా హృదయం.. నేను ఆమె కాళ్లలాంటివాడిని. ఏదో ఒక రోజున ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్లవచ్చు. కానీ మ్యాడీ నా హృదయంలోనే ఉంటుంది. మారథాన్‌లో పాల్గొన్నప్పుడల్లా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటుంది’’ అని.. గత ఆదివారమే మ్యాడీ, రిక్‌లో శాన్‌ఫోర్డ్‌లో జరిగిన ట్రయథ్లాన్(16 మైళ్లు)లో పాల్గొన్నారు. గెలిచారా? లేదా అని ప్రశ్నిస్తున్నారా? మన హృదయాలను గెలుచుకోలేదూ.. కావాలంటే ఓసారి ఆ ప్రశ్న మీ మనసునే అడగండి ?

Rick van Beek runs triathlon carrying cerebral palsy daughter

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mars curiosity under hacker attack
Hyderabad old city traffic rules today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles