August 15th celebrations in all over the andhra pradesh

august 15th celebrations in all over the andhra pradesh

august 15th celebrations in all over the andhra pradesh

5.gif

Posted: 08/15/2012 01:45 PM IST
August 15th celebrations in all over the andhra pradesh

      aug_15theeee ఆగష్టు 15 జెండా పండుగ సందర్భంగా మువ్వన్నెల జెండా రాష్ట్రంలో రెపరెపలాడింది. సీఎంతో పాటు ప్రముఖ నేతలంతా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలంగానే స్వాంతంత్ర్యం సిద్ధించిందని స్వాంతత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి శ్లాఘించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోందన్నారు. సంక్షేమ, అభివృద్ధి cmపథకాలను కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ వర్తింప చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్థిల్లి దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు.
         గాంధీభవన్ లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఎగురవేసిన పీసీసీ చీఫ్ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ గాందీభవన్ లో జాతీయ జెండా ఎగురవేశారు.సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు నేతలు జెండా వందనంలో పాల్గొన్నారు.
      aug_5 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగుర వేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారిందని చంద్రబాబు అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని సాధించినప్పుడే త్యాగధనుల పోరాటానికి ఫలితం దక్కినట్టు అవుతుందని బాబు అన్నారు. aug_3ee
       టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగురవేశారు. కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యలతో పాటు ముఖ్యనాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను దగా చేసిందని నాయిని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
     aug_2 వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ గౌరవద్యక్షురాలు వైఎస్ విజయమ్మ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
    రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపులు, స్కూల్స్, అన్నింటా జాతీయ జెండా రెపరెపలాడింది. ఉదయం నుంచీ చిన్నారులు త్రివర్ణపతాకాన్ని చేతబట్టి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో జెండావందనం సమర్పించారు. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Independence day celebrations at chiru blood bank
High alert in major cities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles