Will kill infidel imran khan pakistan taliban

Will kill 'infidel' Imran Khan: Pakistan Taliban,Imran Khan, Taliban, Jemima Khan, Tehrik-i-Taliban Pakistan

Will kill 'infidel' Imran Khan: Pakistan Taliban

Imran.gif

Posted: 08/13/2012 01:39 PM IST
Will kill infidel imran khan pakistan taliban

Will kill 'infidel' Imran Khan: Pakistan Taliban

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్‑ను చంపుతామని తాలిబన్‑లు బెదిరించారు. ఆఫ్ఘన్ సరిహద్దులలో తమకు పట్టు ఉన్న గిరిజన ప్రాంతంలో అమెరికా దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తే చంపుతామని వారు హెచ్చరించారు. దాడులకు వ్యతిరేకంగా సెప్టెంబరులో తాను వజిరిస్తాన్‑లో తలపెట్టిన ర్యాలీలో వేలాది మంది పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఆమెరికా దాడులలో తమ పోరాట యోధులు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ తాలిబన్ అధికార ప్రతినిధి అసన్‑ఉల్లా చెప్పారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖానే తమ లక్ష్యం అన్నారు. ఎందుకంటే ఇమ్రాన్ తమని మతపరమైన నమ్మకంలేని 'స్వతంత్రులు'గా చెప్పుకుంటారని ఆయన వివరణ ఇచ్చారు.

అసోసియేటెడ్ ప్రెస్ విలేకరి ఒకరు వజిరిస్తాన్ అటవీ పర్వత ప్రాంతాలలోని ఒక మారుమూల ప్రదేశంలో అసన్ వద్ద ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అక్కడ ఉన్న అనేక మంది తాలిబన్‑ల వద్ద ఎకె -47 ఆయుధాలు ఉన్నాయి. ఇమ్రాన్ సహాయాన్ని తాము కోరుకోవడంలేదని అసన్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో పాల్గొనే అందరిపైన దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్ పార్టీలతో సహా ఎన్నికలలో పాల్గొనే అందరిపైన దాడులు చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ అంటేనే లౌకిక విధానం అని చెప్పారు. తాము కోరుకునేది ఇస్లామిక్ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్‑నే లక్ష్యంగా చేసుకున్న తమ ఆత్మాహుతి దళాలకు చిక్కితే తాము అతనిని చంపుతామని అసన్ హెచ్చరించారు. తాము ఎవరి సహాయాన్ని, సానుభూతిని కోరడంలేదన్నారు. తాము దేవుని సహాయంతో పోరాడతామని చెప్పారు.పాకిస్తాన్‑లో ఇమ్రామాన్‑ను విమర్శించే వారికి కూడా ఈ బెదిరింపు విస్మయాన్ని కలిగించే అంశం. సంప్రదాయ ముస్లింవాదులతో అతనికి ఉన్న సంబంధాలు, అతని అభిప్రాయాల ప్రకారం అతనిని 'తాలిబన్ ఖాన్' అని ముద్దుగా పిలుస్తారు.

జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 1992లో ప్రపంచ క్రికెట్‑కప్ గెలుచుకున్న పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్. దాంతో ఆయన పాకిస్తాన్‑లో అత్యంత ప్రముఖులలో ఒకడయ్యాడు. ఆ తరువాత ఆయన రాజకీయ పార్టీ స్థాపించి దశాబ్దం దాటినా గత సంవత్సర కాలంగానే ఆయన పార్టీ ఊపందుకుంది. అతని జీవన శైలి అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. బ్రిటన్ దేశస్తురాలు జెమీమాని పెళ్లి చేసుకోవడంతో ఆయనకు విస్తృతంగా ప్రచారం లభించింది. అయితే చాలా కాలం క్రితమే ఆమె నుంచి ఆయన విడాకులు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Free and fair saudi arabia to build a women only city
New militant outfit in jak threatens girls against using mobiles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles