Constable turned maoist surrenders

Constable-turned-Maoist surrenders,Kodapa Ganesh, deserter police constable, Lingapur police station,Ganesh had taken,Adilabad Superintendent of Police S. Tripathi

Constable-turned-Maoist surrenders

Constable.gif

Posted: 08/09/2012 12:51 PM IST
Constable turned maoist surrenders

Constable-turned-Maoist surrenders

పదహారేళ్ల క్రితం తుపాకీతో పరారైన పోలీసు కానిస్టేబుల్ లొంగిపోయినట్టుగా సమాచారం. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(యూ) మండలం పోలీసు స్టేషన్‌ను పిపుల్స్‌వార్ నక్సలైట్లు పేల్చివేసిన ఘటనలో పాల్గొన్నట్టుగా భావిస్తున్నమాజీ కానిస్టేబుల్ కొడప గణేష్ అజ్ఞాతం వీడి సుదీర్ఘకాలం తరువాత లొంగిపోయినట్లు తెలుస్తోంది. 1990 సివిల్ పోలీస్ బ్యాచ్‌కు చెందిన కొడప గణేష్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో తొలి పోస్టింగ్ నిర్వహించిన అనంతరం సిర్పూర్(యూ) మండలం లింగాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీఅయ్యారు.  అప్పట్లో ఆ ప్రాంతంలో మంగిదళం కార్యకలాపాలు అధికంగాఉండేవి. 1996 జూన్‌లో గణేష్ పోలీస్ స్టేషన్‌లో సెంట్రీ డ్యూటీ నిర్వహించే సమయంలో 303 తుపాకీ, 50రౌండ్ల బుల్లెట్లతో అదృశ్యమయ్యాడు. దీంతో గణేష్ పీపుల్స్‌వార్‌లో చేరి ఉంటాడని జిల్లా పోలీసులు భావించారు. అనంతరం నవంబర్‌లో సిర్పూర్(యూ) పోలీస్‌స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసి పేల్చివేయగా ఎస్సై షరీఫ్ సహా13 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో పీపుల్స్‌వార్‌లో చేరిన కానిస్టేబుల్ గణేష్‌కు ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించారు.

గణేష్‌పై ప్రభుత్వం రూ.లక్ష రివార్డు ప్రకటించింది. జిల్లాలోని మంగి, సిర్పూర్(టి) దళాలలో కమాండర్‌గా గణేష్ పని చేసినట్లు తెలియగా, కవ్వాల్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సూర్యంతో కూడా సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. ఇటీవల పోలీసులు గణేష్ ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించి లొంగిపోతే పోలీసు శాఖలో ఎదైనా ఉద్యోగం కల్పిస్తామని, ఎలాంటి కేసులు ఉండవని చెప్పడంతో లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇంతకాలం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులతో ఉన్న గణేష్ అనారోగ్యానికి గురికావడంతో లొంగుబాటు కోసం సిర్పూర్(యూ) మండలం మహాగాం పటేల్‌గూడలో ఉంటున్న తమ్ముడు గంగారాం ఇంటికి వచ్చినట్టు సమాచారం. కాగా, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావంటూ గ్రామస్తులు ప్రశ్నించడంతో లింగాపూర్ స్టేషన్ నుంచి వెళ్లి నక్సలైట్లను కలువగా తన దగ్గరున్న తుపాకీ, బుల్లెట్లను లాక్కొని వెళ్లగొట్టారని చెప్పినట్టు సమాచారం. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లి లారీ క్లీనర్‌గా జీవిస్తున్నానని తెలిపినట్టు సమాచారం. దీంతో గ్రామస్తుల సూచనల మేరకు ఉట్నూర్ ఏఎస్పీని ఆశ్రయించడంతో జిల్లా కేంద్రంలో సరెండర్ చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teenage girl hired five contract killers to murder her parents after they opposed her plans to wed married lover
Srikalahasti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles