Srikalahasti

srikalahasti, Kings, House, New House , Sri Prasanna varadarajuswami Temple, addalameda, businessman,

srikalahasti

srikalahasti.gif

Posted: 08/09/2012 12:47 PM IST
Srikalahasti

sorangam

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చారిత్రక కట్టడం తాలూకు అవశేషాలు బయటపడ్డాయి. పట్టణంలోని నగరి వీధిలో అద్దాలమేడ అనే ప్రాచీన భవనం ఉన్నచోట ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా సొరంగం బయటపడింది. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయశాఖ అధికారులు ఈ సొరంగాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి కేంద్రంగా చేసుకుని కొంతమంది రాజులు పాలన చేశారు. సుమారు రెండు శతాబ్దాల కిందట రాజా తిమ్మనాయనంగారు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆయన కాలంలో పట్టణంలోని నగరివీధిలో రాణుల కోసం 'అద్దాల మేడ' నిర్మించారు. రాణులు శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం అద్దాలమేడ నుంచి వరదరాజస్వామి ఆలయంలోకి సొరంగ మార్గం ఉండేదని చెబుతుండేవారు. ఆనాటి 'అద్దాలమేడ' ఇరవై ఏళ్ల కిందటి వరకు ఉండేది. సంస్థానాల శకం అంతరించాక అద్దాలమేడ ఇతరుల పరమయింది. ఇరవై ఏళ్ల వ్యవధిలో ఈ స్థలం నలుగురు వ్యక్తుల చేతులు మారింది. బట్టల వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి ఇటీవల ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో భవనం నిర్మించాలని తూర్పు దిశగా పునాదులు తవ్వుతుండగా ఒక్కసారిగా రెండు సొరంగాలు బయట పడ్డాయి. సుమారు ఐదు అడుగుల లోతు వరకు ఒక సొరంగం కనపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Constable turned maoist surrenders
Seetha nagamani mother died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles