Government jobs appsc

government jobs appsc

government jobs appsc

17.gif

Posted: 08/05/2012 03:49 PM IST
Government jobs appsc

      సర్కారీ కొలువులు పొందాలనుకునే యువకులకు ప్రస్తుత కాలంలో పలు అవకాశాలు తలుపుతడుతున్నాయి. పక్కా ప్రణాళికతో తర్పీదు పొందిన వారకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెగ్గుకురావటం తలకుమించిన భారం కూడా కాదు. తాజాగా  గ్రూప్-4 జూనియర్ appsc_fఅకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈనెల 11న నిర్వహించనున్న రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 1,486 పోస్టులకుగానూ 9,58,333 మంది దరఖాస్తు చేసుకున్నారని, రాత పరీక్షకు 2,629 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని ఆమె చెప్పారు. పేపర్-1ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు ఉంటుందని తెలిపారు. 11వ తేదీ ఉదయం 9 గంటల వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని poonam_fవివరించారు. ఒక జిల్లా విద్యార్థి ఇంకో జిల్లాలో పరీక్ష రాసిన సందర్భంలో.. ఆ అభ్యర్థి హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్ష కేంద్రంలోనే పరీక్ష రాసే అవకాశం కల్పించామని మాలకొండయ్య చెప్పారు. అయితే, గ్రూప్-4 జిల్లా యూనిట్ అయినందున.. లోకల్ అభ్యర్థిగా పరిగణించాలంటే.. పరీక్ష హాల్లో నామినల్ రోల్ వద్ద సొంత జిల్లాను రాయాలని.. నాన్‌ లోకల్‌గా పరిగణించాలనుకుంటే పరీక్ష రాస్తున్న జిల్లాను పేర్కొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో వైట్‌నర్ వాడటానికి వీలు లేదని, అలా వాడితే ఓఎంఆర్ షీట్‌ను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.
       ఇంకా, త్వరలో కొత్త నోటిఫికేషన్లు: 107 చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి, 377 ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏఈ, డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడుతాయని పూనం మాలకొండయ్య తెలిపారు. గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పది పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించిందని, వీటిని కొత్తగా గ్రూప్-2 ద్వారా భర్తీచేస్తామని తెలిపారు. వార్షిక క్యాలెండర్‌కు ఇంకా ఆమోదం రావాల్సి ఉందన్నారు. ఈ వార్షిక క్యాలండర్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఖాళీ అయ్యే పోస్టులను అన్ని శాఖలు ఆర్థిక శాఖకు పంపితే.. వాటి భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చే ప్రక్రియ జనవరి మాసంలో పూర్తవుతుందని ఆమె స్పష్టం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maha radhostavam in matralayam
Guinness book acheiver  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles