"ప్రేమకోసం, ప్రేమించిన వారికోసం ప్రాణాలిస్తాం''.. ఇది తెలుగు సినిమాల్లో రొటీన్‌గా వినబడే డైలాగ్. కానీ ఈ మాటల్ని చేతల్లో చూపించారు ముగ్గురు అమెరికా కుర్రాళ్లు. తమ ప్రేయసులకోసం తుపాకీ గుళ్లకు ఎదురొడ్డారు. తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి తమ నెచ్చెలిని బతికించుకున్నారు. వారు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేశంలో కళ్లు చెమర్చే ఈ ఘటన అమెరికాలోని ఓ థియేటర్‌పై ఓ ఉన్మాది జరిపిన కాల్పుల సందర్భంగా చోటు చేసుకుంది. మాట్ మెక్క్విన్(27), జొనాథన్ బ్లంక్(26), అలెక్స్ టెవెజ్(24) తమ ప్రియురాళ్లతో కలిసి బాట్మన్ సిరీస్‌లో కొత్తగా విడుదలైన సినిమా 'ద డార్క్‌నైట్ రైజెస్' సినిమా మొదటి షోకు వెళ్లారు. సినిమా మొదలైన కొద్ది సేపటికే జేమ్స్ హోమ్స్ అనే ఉన్మాది విచక్షణారహితంగా థియేటర్లోని జనంపై తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. తుపాకీ గుళ్లనుంచి తన ప్రేయసి సమంతా యోలర్కు తుపాకీ గుళ్లు తగలకుండా మెక్క్విన్ అడ్డంగా నిలబడ్డాడు.
తన ప్రాణాలను అర్పించి ప్రేయసిని బతికించుకున్నాడు. బ్లంక్ అయితే తన ప్రియురాలు జెన్సన్ యంగ్‌ను సీటుకింద కూర్చోబెట్టి బుల్లెట్ల బారినుంచి రక్షించాడు. ఈక్రమంలో తాను ఆ తుపాకీ తూటాలకు బలైపోయాడు. తనను బతికించడంకోసమే బ్లంక్ ప్రాణాలర్పించాడంటూ ఆ ప్రేయసి కన్నీరుమున్నీరవుతోంది. మూడో యువకుడు టెవెజ్ తన నెచ్చెలి అమందా లిండ్జెన్ ప్రాణాలను కాపాడడానికి ఆనందంగా తుపాకీ గుళ్లను స్వీకరించాడు. ఆమెకు రక్షణ కల్పిస్తూ తాను బలైపోయాడు. తమ ప్రేమను బతికించుకోవడానికి ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురికి యావద్దేశం నివాళులర్పింస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more