67 pilgrims dead during 2 weeks of amarnath yatra

67 pilgrims dead during 2 weeks of Amarnath yatra.,Shri Amarnath Shrine Board,Omar Abdullah, Amarnath Yatra,Amarnath Pilgrims

67 pilgrims dead during 2 weeks of Amarnath yatra

Amarnath.gif

Posted: 07/13/2012 10:57 AM IST
67 pilgrims dead during 2 weeks of amarnath yatra

67 pilgrims dead during 2 weeks of Amarnath yatra

దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న పవిత్ర శివలింగాన్ని దర్శించుకోవటానికి బయలుదేరిన అమర్‌నాథ్‌ యాత్రీకుల్లో 67 మంది మరణించటం పట్ల ఈ యాత్రా నిర్వహణ బోర్డు ఆందోళన వెలిబుచ్చింది. వీరంతా కార్డియాక్‌ అరెస్ట్‌తో(గుండె కొట్టుకోవటంలో సంభవించిన అపసవ్యతలమూలంగా గుండె ఆగిపోవటం) మరణించారని భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బోర్డు, యాత్రీకులకు వచ్చే అన్ని అరోగ్యసమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. గత సంవత్సరంలో చేపట్టిన 45రోజుల అమర్‌నాథ్‌ యాత్రలో 105 మంది యాత్రీకులు మరణించారు. సహజకారణాల వల్ల మరణించిన మృతుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక సంఖ్య.కాగా ఈ సంవత్సరం, యాత్ర మొదటి రెండు వారాల్లోనే పెద్ద సంఖ్యలో యాత్రీకులు చనిపోవటం కూడా గతంలో సంభవించలేదని ఇది కూడా అత్యధికమే అని శ్రీ అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు(ఎస్‌ఏఎస్‌బీ) అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. సాధారణంగా కార్డియాక్‌ అరెస్ట్‌ ఎక్కువ ఎత్తుల్లో ప్రయాణిస్తున్న వారిలో ఆక్సిజన్‌ అందకపోవటం వల్ల సంభవిస్తుంది. ఈ యాత్రలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాతే అధికారులు వారిని యాత్రలో పాల్గొనటానికి అనుమతిస్తారు. యాత్రీకుల్లో చాలామంది నకిలీ ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలతో ప్రయాణిస్తున్నట్లు అనేక కేసుల్లో బయటపడిందని బోర్డు అధికారులు అంటున్నారు.

67 pilgrims dead during 2 weeks of Amarnath yatra

అమర్‌నాథ్‌ యాత్రీకు సౌకర్యార్థం రెండు మార్గాల్లో డజన్లకొద్డీ వైద్య శిభిరాలను ఏర్పాటుచే సినట్లు బోర్డు తెలిపింది. కాగా ప్రస్తుత అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 2న పూర్తవుతుంది. వయో వృద్ధులు, ఫిట్‌నెస్‌ సరిగాలేనివారు, హి మాలయ వాతావరణానికి అలవాటు పడలేని వారు మరణిస్తున్నా రని జమ్ము, కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొనటంపై అనేక విమర్శ లు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా అమర్‌నాథ్‌ యాత్రలో రద్దీ నెలకొంది. ఇప్పటి వరకు సుమారుగా నాలుగు లక్షల మంది యాత్రీకులు పవిత్ర శివలింగాన్ని దర్శించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dozens injured trying to scoop up fuel in nigerian oil tanker blast
No fly list man stranded in bahrain returns to us  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles