Kishore chandra dev from ap in new central cabinet

Kishore Chandra Dev from AP in New Central Cabinet

Kishore Chandra Dev from AP in New Central Cabinet

Kishore.gif

Posted: 07/05/2012 11:56 AM IST
Kishore chandra dev from ap in new central cabinet

Kishore Chandra Dev from AP in New Central Cabinet

ఉప రాష్ట్రపతి ఎన్నికల రేసులో కాంగ్రెస్ అభ్యర్థులుగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి కిశోర్ చంద్రదేవ్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్‌సీ జమీర్ తదితరుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్‌లోని సీనియర్ గిరిజన నేతల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిశోర్‌తోపాటు జమీర్ కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గిరిజనుడిని నిలబెడితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ గిరిజనుడికి మద్దతివ్వలేదని విపక్షాల తరఫు రాష్ట్రపతి అభ్యర్థి పీఏ సంగ్మా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు అభ్యర్థులుగా దళితుడైన సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్‌ల పేర్లూ వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోవడంతో తమ అభ్యర్థిని నిలబెట్టడంపై బీజేపీ అసక్తి కనబరచడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ, కాంగ్రెసేతర పార్టీలు కానీ అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధ్యక్షురాలు సోనియాకు కట్టబెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana
Andhra govt bends rule aruna off to us for 16 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles