Happy ending on swetha kidnap issue

happy ending on swetha kidnap issue

happy ending on swetha kidnap issue

9.gif

Posted: 07/01/2012 01:55 PM IST
Happy ending on swetha kidnap issue

      విజయవాడకు చెందిన శ్వేత కిడ్నాప్ ను పోలీసులు ఛేదించారు. మంగళగిరి ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోన్న శ్వేత డాక్టర్ శర్మ కుమార్తె. రోజూలాగే ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన ఆమెను  డాక్టర్ శర్మ దగ్గరే డ్రైవర్ గా పనిచేస్తున్న మందా ప్రసాద్ మరో 4నలుగురితో కలిసి కిడ్నాప్  చేశాడు. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మంగళగిరి జాతీయ రహదారిపై ఆమెను ఎక్కించుకున్నాక ఇంటికి ఫోన్  చేసి మూడు కోట్లరూపాయలు డిమాండ్  చేశారు. కంగారు పడ్డ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చకచకా గాలింపును మొదలెట్టేశారు. దీనికోసం వారు నాలుగు బృందాలుగా విడిపోయారు. కనిపించిన ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. సెల్ ఫోన్  సిగ్నల్స్ ద్వారా కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించారు.
      పామర్రు పరిసరాల్లోనుంచే ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో నిఘాను పెంచారు. దీంతో పామర్రు ఎన్టీఆర్ జంక్షన్ దగ్గర నిందితులు పోలీసుల వలలో పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించారు. కిడ్నాపైన శ్వేతను కూడా కొద్దిసేపు విచారించి ఆమెను ఇంటికి పంపేశారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో కేవలం మూడు గంటల వ్యవధిలోనే నిందితులు పట్టుబడ్డారు. పోలీసులను శ్వేత తల్లిదండ్రులే కాదు స్థానికులూ అభినందిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King akkineni nagarjuna in chanchal guda jail
Mp lagadapati rajagopal comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles