Dead man runs in indias presidential election

Dead man' runs in India's presidential election,presidential polls, santosh kumar singh, uttar pradesh government, raisina hill

Dead man' runs in India's presidential election

Dead000.gif

Posted: 06/23/2012 11:02 AM IST
Dead man runs in indias presidential election

Dead man' runs in India's presidential election

ఒక వ్యక్తి చనిపోయిన తరువాత  తిరిగి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  ఇది నిజంగానే జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో 'మృతుడు' పోటీ చేయడమేమిటని ఆశ్యర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ రికార్డుల ప్రకారం 32సంవత్సరాల సంతోష్‌కుమార్‌ సింగ్‌ అధికారికంగా మరణించిన వ్యక్తి. అయితే నిజజీవితంలో ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. తను ప్రాణాలతోనే ఉన్న సంగతిని యావత్‌ ప్రపంచానికి చాటేందుకు రాష్ట్రపతి ఎన్నికలను వేదికగా కుమార్‌ ఎంచుకున్నారు. నామినేషను దాఖలు చేసేందుకు సన్నాహాల్లో మునిగారు. తద్వారా యుపి ప్రభుత్వ నిర్వాకాన్ని వ్యవస్థకు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నట్లు చేతిలో రిటర్నింగు అధికారి ఇచ్చిన రశీదును చూపుతూ సంతోష్‌సింగ్‌ చెప్పారు. వాస్తవానికి ఈ ఎన్నికల ఘట్టానికి ముందుగానే జంతర్‌మంతర్‌ దగ్గర మీడియా దృష్టిని ఆకర్షించేందుకు సింగ్‌ నానా తంటాలు పడ్డాడు. ఫలించలేదు. ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ సింగ్‌ మొరను ఆలకించిన పాపాన పోలేదు. ఇపుడు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో ఎదురైన అవకాశాన్ని తను జీవించి ఉన్నానని రుజువు చేసేందుకు ఉపయోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు.

నామినేషను దాఖలుకు అవసరమైన పత్రాల సేకరణలో నిమగమైనట్లు చెప్పారు. కాగా తన నామినేషను దాఖలు సమయంలోనే తిరస్కరణకు గురవుతుందనే వాస్తవం తనకు తెలుసునని సంతోష్‌సింగ్‌ పేర్కొంటున్నాడు. కానీ ఏ మూలో మినుకు మినుకు మనే చిరు ఆశతో పోరు సాగిస్తున్నాడు.  నామినేషను దాఖలు చేయడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సింగ్‌కు అవసరమైన పత్రాలతో రావాలని అధికారులు సూచించారు. యుపి ప్రభుత్వం కళ్లు తెరుచుకునేందుకుగాను తన శక్తి వంచన లేకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తానని సింగ్‌ అన్నారు. దీనికి ముందు ఒక నిరాశాపూర్వక అనుభవాన్ని సింగ్‌ ఎదుర్కొన్నాడు. వారణాసి జిల్లాలోని చిత్తోని గ్రామంలో 12.1ఎకరాల భూమిని తన హక్కుభుక్తం చేసుకునేందుకు సింగ్‌ పెద్ద పోరాటమే చేశాడు. ఆభూమిని దక్కించుకున్నాడు. అయితే భూమి మీద కన్నేసిన బంధుగణం సింగ్‌ను మృతునిగా చిత్రించి తన్ని తరిమేశారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed to attach gali janardhana reddys properties soon online
Puri shrine cops assault tourist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles