Kasab every day one hour relief in arthur road jail

kasab every day one hour relief in arthur road jail

kasab every day one hour relief in arthur road jail

kasab.gif

Posted: 06/19/2012 06:50 PM IST
Kasab every day one hour relief in arthur road jail

Arthur Road Jail

పాక్  ఉగ్రవాది  అజ్మల్  కసబ్ ను జైలులోని అతడి సెల్ నుంచి ప్రతి రోజు గంటపాటు  జైలు అధికారులు  వెలుపలికి  తీసుకువస్తున్నారు.  కసబ్ ఆరోగ్యం  సజావుగా  ఉండేందుకు  తాజా గాలితో  పాటు ఎండ తగిలేందుకు  ఈ చర్యలు చేపడుతున్నట్లు  ఆర్థర్  రోడ్డు జైలు  అధికారి  ఒకరు  తెలిపారు.  26/11 తీవ్రవాదుల దాడి  కసులో దోషి అయిన   కసబ్ కు  ఖైదీ నెంబరు సి- 7096 ను జైళ్ల శాఖ  కేటాయించింది.  ఆర్థర్  రోడ్డు  జైలులో  ప్రత్యేకంగా  రూపొందించిన 10/10  సెల్ లో  కసబ్ ను ఉంచి రాత్రింబవళ్లు  సాయుధ  పోలీసు బలగాలు కాపలా కాస్తున్నారు.  గాలి, వెలుతురు తగిలెందుకు  కసబ్ ను వెలుపలికి తెచ్చిన  ప్రతిసారీ అత్యాధునిక  ఆయుధాలు ధరించిన అరడజన్ మంది పోలీసులు  వెయ్యికళ్లతో  పహారా కాస్తున్నారు.  అప్పుడప్పుడు  కసబ్  పోలీసులతో  పిచ్చాపాటి  మాట్లాడతాడని  జైలు వర్గాలు తెలిపాయి.  కసబ్ ప్రతి కదలికను  అధికారులు క్షుణ్ణంగా రికార్డు  చేస్తున్నారు.  ఎన్ని గంటలకు  బ్రష్  చేస్తాడు, ఎంత సమయం బాత్ రూమ్ లో  గడిపాడు తదితర వివరాలన్నింటిని  ప్రత్యేకంగా  రిజిస్టర్ లో  నమోదు చేస్తున్నట్లు  వివరించాయి. ఎప్పటికప్పుడు  ఈ రిజిస్టర్ ను  సీనియర్  అధికారులు  పరిశీలిస్తున్నాట్లు తెలిపాయి.  కసబ్  వద్ద డబ్బు లేకపోవడంతో  ఖైదీ యూనిఫారంను  ల్యాండ్రీకి వేయకుండా  స్వయంగా ఉతుక్కుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జైల్లో  అతడిని కలిసేందుకు  మాత్రం ఎవరినీ అనుమతించటం లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan to get new pm as sc disqualifies yousuf raza gilani
Fire mountain in california  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles