అంతర్జాతీయ ‘సర్వేక్షణ’ ఒకటి చాలా తమాషా సంగతి చెప్పింది. ఆడాళ్లు ఆఫీసుల్లో మగాళ్లకన్నా తక్కువ సమయం గడుపుతారు కనుక వాళ్లుఎక్కువ సంతోషంగా- ఎక్కువ ఆయుర్దాయంతో బతుకుతారుట! ‘‘ఉన్నత విద్య, పెద్ద ఉద్యోగాల్లో వున్న మహిళామణులు- ఈ ప్రయోజనాన్ని ఎక్కువగా పిండుకుంటున్నారు’’ అంటోంది- ఇండియాతో సహా అనేక అడ్వాన్స్‌డ్ దేశాలలో- ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గణాంకాలు- తయారుచేసిన ఒక సంస్థ (ఒ.ఇ.సి.డి). వంటింట్లో సగటున ప్రతీ ఉద్యోగినీ రోజుకి 249 నిమిషాలు పనిచేస్తే-మగాడు అందులో సగం కూడా చేయడు గానీ- ముఖ్యంగా- బి.పి.ఓలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు- తోలు పరిశ్రమలు వగైరాలలో పనిచేసే వనితలకు ఆర్థిక స్వేచ్ఛతోపాటు - ‘‘అభద్రత’’ అదే స్థాయిలో పెరుగుతోందిట. ‘‘ఆడదాని స్వేచ్ఛ- అరిటాకుమీద ముల్లులాంటిది’’.
ఆసుపత్రుల్లో నర్సులు లాంటి వారికి - నూటికి యాభై మూడు వంతులు- శీలభంగ, మానభంగ ప్రమాదాలే ఎక్కువ. ‘‘అందమైన యువతులకే ఎక్కువ ఛాన్స్ ఇస్తాం’’- అనే చిన్న పరిశ్రమలు మొదలు- అన్నిరకాల ఉద్యోగాలలో అభద్రత, స్వేచ్ఛ- రెండు వైపులా వాడి వున్న కత్తుల్లాగ వాళ్లని హంసిస్తాయని- అయినా, స్ర్తిలు- పురుషులతో సమానంగా- భూమ్యాకాశ రంగాలన్నింటా పోటీ పడటానికే కృషి చేస్తున్నారనీ- పరిశోధకుల పరిశీలన! తథాస్తు!
ఆడాళ్లకి బంగారం అంటే చెప్పలేనంత ఇష్టం. మహారాష్టక్రి చెందిన సావిత్రీదేవికి మాత్రం మరీ పిచ్చి. నగల కోసం వగలొలకబోస్తూ తన ముప్ఫయి అయిదో ఏట కూడా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలలో-ఓ డజన్ మంది మగ మహారాజుల్ని- ‘స్వయంవరం’గా ఎంచుకొని- పెళ్లి చేసుకుని- ఆనక వాళ్లదగ్గర వున్న డబ్బూ, దస్కం, నగా నట్రా మూట గట్టేసుకుని- అక్కడ్నుంచి జెండా ఎత్తేయడం- ఈ ‘మాడర్న్ వైఫ్’కి- అందం, ఆరోగ్యం, ఒంపుసొంపులతో పాటు దేవుడు ఇచ్చిన విద్య. కానీ, రాజస్థాన్‌కి చెందిన ఆమె తాజా భర్త- బిహారీలాల్ మేఘవాలాకి- రంభ లాటి పెళ్లాం ప్రక్కనుండగా- రాత్రిపూట నిద్రపట్టలేదు కాబోలు- ఇనప్పెట్టె ఖాళీ చేసి మూట కట్టుకుని ఉడాయించబోయిన అందాల పిట్టని పట్టుకుని- పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెతో తన వివాహ మహోత్సవం ఏర్పాటుచేసిన ముగ్గురు మగ మధ్యవర్తులకు- ‘‘ఏభైవేలిచ్చాను- మహాప్రభో’’ అంటున్నాడీ ‘అగ్నిహోత్రావధాన్లు’!
‘‘ఏం? పెళ్లిమీద పెళ్లి చేసుకుంటూ- ఎందరో ఆడాళ్ల నగలు అపహరించిన మగాళ్లు లేరా? ఇది ‘టిట్ ఫర్ టాట్’, అంటుందో వర్కింగ్ గాళ్!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more