Tdp leader uma madhava reddy vijayamma to no comments

TDP leader Uma Madhava reddy vijayamma to no comments, ys jagan,

TDP leader Uma Madhava reddy vijayamma to no comments

vijayamma.gif

Posted: 06/01/2012 11:07 AM IST
Tdp leader uma madhava reddy vijayamma to no comments

తాజాగా టిడిపి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మను విమర్శించేందుకు ఎన్టీఆర్ భవన్‌కు ఆహ్వానించారు. తీరా ఆమె వచ్చాక తాను ఆ అంశంపై మాట్లాడలేనని, ప్రజలకు సంబంధించిన మరే సమస్యపైనైనా మాట్లాడతానని చెప్పి తప్పుకున్నారు. దాంతో విలేఖరుల సమావేశం రద్దు చేశారు. ప్రత్యర్థి పార్టీలో ఏ కులానికి చెందిన నాయకుడిపై విమర్శలు చేయాలన్నా, టిడిపిలో అదే కులం నాయకుడితో విమర్శలు చేయించడం ఆనవాయితీ.

కాగా ఇప్పుడు కొందరు నేతలు సొంత కులం వారిపై విమర్శలు చేయలేం అని తప్పించుకుంటున్నారు. టిడిపి మొదటి నుంచి ఒక కులం నాయకుడిని విమర్శించాలంటే పార్టీలోని అదే కులం వాళ్లతో విమర్శలు చేయించడం ఆనవాయితీగా పాటిస్తోంది. మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాలనుకుంటే అదే కులం లేదా దళిత వర్గం వారిని ఎంపిక చేస్తున్నారు. రెడ్డి నేతలను విమర్శించడానికి అదే వర్గం వారితో పాటు వర్ల రామయ్యకు బాధ్యత అప్పగించారు. ఇక తెలంగాణ నాయకులను విమర్శించేందుకు కెసిఆర్ సామాజిక వర్గానికే చెందిన దయాకర్‌రావుకు కన్వీనర్ బాధ్యత అప్పగించడంతో పాటు మోత్కుపల్లి నర్సింహులుకు విమర్శించే బాధ్యత అప్పగించారు. దేవేందర్‌గౌడ్ పార్టీ వీడి వెళ్లినప్పుడు ఆయన మేనల్లుడు అరవింద్‌కుమార్ గౌడ్‌కు ఆయన్ని విమర్శించే బాధ్యత అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women safe jobs
Ka paul gets interim bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles