Ranga rao quits cong two more to follow

Ranga Rao quits Cong; two more to follow,Congress MLA from Bobbili Sujaya Krishna Ranga ... Ranga Rao ,Savarapu Jayamani,SR Congress. Cong. MLA Sujai Krishna joining Jagan's party turns a

Ranga Rao quits Cong; two more to follow

Jayamani010.gif

Posted: 05/31/2012 11:07 AM IST
Ranga rao quits cong two more to follow

Ranga Rao quits Cong; two more to follow

మరో రెండు రోజులలో పార్వతీపురం నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన ఎమ్మెల్యే పదవి దివంగత నేత రాజశేఖరరెడ్డి చలవేనంటూ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన జయమణి తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే వైకాపాలో చేరడం ఖాయంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

   పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పార్వతీపురం రిజర్వుడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సవరపు జయమణి కూడా అదే బాట పట్టనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లే ప్రసక్తి లేదని చెబుతున్నప్పటికీ కార్యకర్తల అభీష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందని పరోక్షంగా మనసులో మాటను ఆమె వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramdev baba deeksha
Indian expat in italy murders wife for being westernized  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles