అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఐదేళ్ళ బా లుడి ముందు శిరసు వంచారు. ఈ సంఘటన మూడేళ్ళ క్రితం జరిగింది. ఒబామా ఏమిటి, తలవంచటమేమిటి అని ఆశ్చర్యపో వద్దు. ఇది చిన్న విషయమే. ఆఫ్రో అమెరికన్ నావికుడు కార్లాటన్ కుమారుడు జాకోబ్ ఫిలడెల్పియా అనే బాలుడికి తన తల వెంట్రు కలు, ఒబామా తలవెంట్రుకలు ఒకేలా ఉన్నాయా అనే సందేహం వచ్చింది. ఫిలడెల్పియా తన తల్లిదండ్రులు, అన్నతో కలసి మూడే ళ్ళ కింద వైట్‌హౌస్‌ను సందర్శించాడు. అమెరికా జాతీయ భద్ర తామండలిలో సేవలందించి పదవీ విరమణ చేస్తున్న కార్లాటన్ కుటుం బసమేతంగా ఒబామాతో ఫొటో దిగే సమయంలో తన తండ్రి అ నుమతితో ఫిలడెల్పియా పై ప్రశ్నను ఒబామాను అడిగాడు.
ముద్దుగా ఉన్న బాలుడిని మళ్ళీ ప్రశ్నించాలని ఒబామా కోరారు. ఆ తర్వాత ఒబామా ఫిలడెల్పియా సందేహాన్ని నివృత్తి చేయటానికి బాలుడికి తన జుట్టు అందేలా తలను వంచారు. ‘నీ తల వెంట్రు కలు, నా తల వెంట్రుకలు ఒకేవిధంగా ఉన్నాయా అన్న అనుమా నం తీరాలంటే నా జట్టును ముట్టి తెలుసుకో’ అని ఒబామా ఫిలడెల్పియాను కోరారు. ఫిలడెల్పియా ఎలాంటి తడబాటు లేకుండా ఒబామా జు ట్టును తడిమి మనిద్దరిదీ ఒకేలా ఉందని ఆనందం వ్యక్తంచేశాడు. మరోవైపు ఆ బాలుడి తండ్రి కార్లాటన్, సోదరుడు ఈ వింతను ఆ శ్చర్యంగా చూస్తుండిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని వైట్‌హౌస్ ఫొటోగ్రాఫర్ పీటె సౌజా తన కెమెరాలో బందించాడు.
ప్రింట్ తీసి వైట్‌హౌస్‌లో గోడకు అలంకరించాడు. గత మూడేళ్ళుగా ఈ చి త్రం అనేక మందిని ఆశ్చార్యానికి గురిచేస్తోంది. ‘ఈ చిత్రాన్ని చూ సిన వైట్‌హౌస్ సందర్శకులు ఒబామా తలవంచిన తీరుకు కార ణం తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు’ అని సౌ జా మీడియాకు తెలిపారు. కాగా ఒబాకు దీర్ఘకాలంగా సలహాదా రుగా పనిచేసిన డేవిడ్ అక్సెల్డ్ కూడా ఈ ఫొటో కాపీని తన చికాగో కార్యాలయంలో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎనిమిదేళ్ళ వయస్సుకు చేరుకున్న ఫిలడెల్పియా కూడా ఈ ఫొటో కాపీని తన ఇంట్లో గోడకు అలంకరించాడు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more