ఇంతకీ కుక్కల వ్యర్థంతో ఏం చేశాడనుకుంటున్నారా? కరెంటు పుట్టించాడు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిం చే కుక్కల వ్యర్థాలు ఓ వ్యక్తికి చిరాకు పుట్టించింది. పరిసరాలను ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ అదే సమస్య! దీంతో అతనికో ఆలోచన తట్టింది. ఇంకేముంది ఏకంగా ఉద్యోగం మానేసి మరీ దానిపైనే శ్రద్ధ పెట్టాడు. భారీగా కుక్కల వ్యర్థాలను సేకరించడం మొదలుపెట్టాడు. ఇందు కు ఓ కంపెనీని స్థాపించి చివరకు విజయం సాధించాడు. చివరకు బ్రిటన్‌లో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టడమే కాకుండా.. స్థానికంగా వీధిలైట్లను వెలిగించే ప్రాజెక్టు కూడా దక్కించుకున్నాడు. గ్యారీ డౌనీ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఆయన నార్త్ వేల్స్‌లోని ఫ్లింట్‌షైర్ ప్రాంతంలో కుక్కల కేంద్రాలను ఏర్పాటుచేసే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ స్థాయిలో కుక్కల వ్యర్థాన్ని సేకరించి మైక్రోఆర్గనిజమ్స్ ప్రక్రియతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ ప్రక్రియలో వెలువడే మీథేన్ వాయువుతో వీధి దీపాలను వెలిగించడానికి ఫ్లింట్‌షైర్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాను నెలకొల్పుతున్న కుక్కల కేంద్రాల నుంచి, వీధులు, ఇళ్ల నుంచి కూడా వ్యర్థాన్ని సేకరించేందుకు గ్యారీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాడు. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యానికి తన ప్రాజెక్టు దోహదపడుతుందని అతను చెబుతున్నాడు. తన ప్రాజెక్టు ఆర్థికంగా విజయవంతం కావాలంటే రోజుకు నాలుగు టన్నుల వ్యర్థాలు సేకరించాల్సి ఉంటుందని అసలు విషయం సెలవిచ్చాడు!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more