Sirivennela sitarama sastry bday special

Sirivennela Sitarama Sastry B`day special,Sirivennela songs with high quality ,Sirivennela telugu movie songs. Songs from Sirivennela. telugu movie songs from Sirivennela. Sirivennela. Music by KV. Mahadevan,Sirivennela Telugu Audio Songs, Telugu Songs, telugu movie songs, devotional songs, audio songs, hindi songs

Sirivennela Sitarama Sastry B`day special

Sirivennela.gif

Posted: 05/21/2012 08:13 PM IST
Sirivennela sitarama sastry bday special

Sirivennela Sitarama Sastry B`day special

తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న... తెలుగు సిని పరిశ్రమ లో, యనభైయ్యవ శతకం నుండి నేటి వరకు తిరుగులేని పోటి తో దూసుకుపోతున్న పాటలకు మాటల మాంత్రికుడు, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి... నవరసాలలో భావాన్ని పలికించాలన్న, అతి సులభమైన పదాలు, ఒక తెలుగు నిఘంటువు చదివితే కాని అర్ధం కాని పదాలు, ఇలా అన్ని వర్గాలవారికి అర్ధం అయ్యే విధంగా, అలరించేవిధంగా పాటలు రాయడం, సిరివెన్నెల వారి ప్రత్యేకత... తెలుగు సినీ పరిశ్రమలో కలకాలం గుర్తుంది పోయే సినిమాలు, 'సిరివెన్నెల', 'స్వర్ణకమలం', 'సాగరసంగమం', 'గాయం' ఇలా ఒక్క సినిమా, ఒక్క పాట కాదు... ఆయన ప్రతీ రచన ఒక ఆతిముత్యమే... ఆయన రచనలు మనల్ని ఆలోచింప చేస్తాయి, సామాజిక స్పృహ కలిగి ఉంటాయి, ప్రేమ భావాన్ని పలికిస్తాయి, మానవ సంబంధాల విలువెంతో మరొక్కసారి గుర్తు తెప్పిస్తాయి... ఇలా గత పాతికేళ్ళుగా ప్రతీ అడుగు ముందుకు వేస్తున్నారు సిరివెన్నెల అని అనడం లో మాత్రం సందేహం లేదు...

Sirivennela Sitarama Sastry B`day special

శుభలగ్నం సినిమా లో 'చిలుక తోడూ లేక ఎటేపమ్మ వొంటరి నడక' అని తొందరపాటు లో ఆకాశానికి నిచ్చెనే వెయ్యాలి అని మనం తీసుకునే నిర్ణయాలని మనమే ప్రశ్నించుకునేలా రాయాలన్న... ప్రేమకథ సినిమా లో 'దేవుడు వరమిస్తాడని వారములు కురిపిస్తాడని, నమ్మలేదు, నాకు నీవే దొరికే వరకు', ప్రతీ ప్రేమ జంట మనసు దోచేలా అక్షరాలని జత చెయ్యాలన్న, రచయిత గా తన మొదటి సినిమా సిరివెన్నెల లో 'గాలి నెల, ఊరు సెలయేరు' అంటూ తను పుట్టిన ఊరు గొప్పతనాన్ని చాటే యువకుడి మనోభావాలని పాట రూపం లో పొందు పరచాలన్న, కేవలం సిరివెన్నెల వారికే సాటి...

Sirivennela Sitarama Sastry B`day special

చిత్ర పరిశ్రమ లో తనకు ఎవరు వారసులు లేరు, తాను ఎవ్వరికీ వారసుడు కాదని, పత్రికల్లో రచయిత గా పనిచేస్తున్న తన ప్రతిభను గుర్తించి, తన కు రచయిత గా జన్మనిచ్చి, సిరివెన్నెల ని తన పేరు ముందు ఉంచి, తనకు మరో జన్మ ఇచ్చిన, కళాతపస్వి కే. విశ్వనాథ్ గారిని తాను ఎప్పటికీ మరువలేనని ఇప్పటికి గుర్తు చేసుకుంటారు సిరివెన్నెల...

పాటలకు మాటలని అందించే మాంత్రికుడు, మాటల మాంత్రికుడు, ఇప్పటి తరం దర్శకులలో నంబర్ వన్ వరుసలో దూసుకుపోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, తనదైన శైలి లో, తన భావాల ద్వారా, సిరివెన్నెల పై అభిమానాన్ని తెలుపుతూ, రచయిత కి గౌరవం అందించారు, మధ్యనే జరిగిన ఒక కార్యక్రమం లో...

తెలుగు సినిమా గర్వించదగ్గ రచయిత, రోజుకి ప్రతీ పాటని, తన తొలి పాట గా భావించి, స్వరాన్ని, భావాన్ని అర్ధించి, పాటని ఒక యాగం రాసే సిరివెన్నెల వారు, నిన్న తన పుట్టిన రోజుని జరుపుకున్నారు...

మరిన్ని అద్భుతమైన రచనలు రచయిత నుండి ఆశిస్తోంది, అభిమానులందరి తరఫున ఆంధ్రవిశేష్...

సునయన వినయ్ కుమార్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee tables white paper in parliament
Amitabh bachchan tweets aaradhyas name  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles