Ys jagan fire on chandrababu naidu

YS Jagan fire on Chandrababu naidu

YS Jagan fire on Chandrababu naidu

Jagan.gif

Posted: 05/08/2012 06:12 PM IST
Ys jagan fire on chandrababu naidu

YS Jagan fire on Chandrababu naidu

చంద్రబాబుకు ఒక న్యాయం, తమకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లో 535 ఎకరాల భూమిని విలాసవంతమైన భవనాల కోసం కేటాయిస్తే ఒప్పు, యువత ఉద్యోగ అవకాశాల కోసం మహానేత వైఎస్సార్ మారుమూల ప్రాంతాల్లో భూములు కేటాయిస్తే తప్పు అన్నట్లుగా సీబీఐ వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఒక న్యాయం, తమకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్ఠుపట్టిపోయాయన్నారు. దిగజారిన రాజకీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు వేసే ఓటే రాజకీయాల్లో మార్పునకు నాంది కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, వారికి కరువు భత్యం ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి సర్కారు పతనమవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 18 స్థానాల్లో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanu prakash killed suri
New police controversy on gabbar singh movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles