Political parties in andhra pradesh

political parties in andhra pradesh, state, ata, YS Jagan, Chandra babu naidu, CM, Chief minister, CM Kiran, Kiran kumare reddy, babu, ysr party, congress party, Telugudesam party, YSR Party,

political parties in andhra pradesh

parties.gif

Posted: 05/05/2012 10:38 AM IST
Political parties in andhra pradesh

political parties in andhra pradesh

తాజాగా, అధికార కాంగ్రెస్ జాబితా వెలువడటంతో పార్టీ సీనియర్లు ప్రచారంపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరు నుంచి ఉప ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఆట మొదలైంది. ఎట్టకేలకు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించటంతో ఉప పోరు ప్రచారం వేడెక్కనుంది. మరో రెండేళ్ళలో జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న అత్యంత కీలకమైన ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ సహా, తెలుగుదేశం, కాంగ్రెస్ వైఎస్సార్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్‌లు ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి జూన్ 12న ఉప ఎన్నికలు జరగనుండగా చంద్రబాబు, జగన్‌లు ఇప్పటి వరకు దాదాపు పది స్థానాల్లో ప్రచారం చేశారు. జగన్ అయితే నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు కూడా మధ్యమధ్యలో విరామమిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లాలవారీ సమీక్షా సమావేశాలు, ఆసంతృప్తుల్ని బుజ్జగించడంలో ఇప్పటి వరకు నిమగ్నమయ్యారు. క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీ సమీక్షలు జరుపుతూ ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక మీదట ప్రజాపథం పర్యటనలకు స్వస్తి చెప్పి ఉప ఎన్నికల ప్రచారంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ప్రధాన ఆకర్షణ శక్తిగా భావిస్తున్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అధిష్ఠానం చెబితే ప్రచారం చేస్తానని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sourav ganguly
Delhis overseas players visit the taj mahal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles