Dammu brings to fore naidu jr ntr cold war

Dammu Brings to Fore Naidu, jr NTR Cold War, TDP supremo Chandrababu Naidu, Nandamuri Harikrishna and his actor son junior NTR

Dammu Brings to Fore Naidu, jr NTR Cold War

Dammu1.gif

Posted: 05/04/2012 12:08 PM IST
Dammu brings to fore naidu jr ntr cold war

Dammu Brings to Fore Naidu, jr NTR Cold War

జూనియర్ ఎన్టీఆర్ వర్గాన్ని సాగనంపే ప్రయత్నంలో టీడీపీ అధినేత దమ్ము సినిమా ఏం బాగలేదు.. వేస్ట్.. ఇదీ టీడీపీ నేతల ప్రచారం. దమ్ము సినిమా చూడొద్దు.. ఎస్‌ఎంఎస్‌లు.. సినిమా విడుదల రోజు కృష్ణా జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చిన టీడీపీ.. జూనియర్ ఎన్టీఆర్ వర్గీయుడైన వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీస్ జారీచేసి ఆయన వర్గంపై దాడిని తీవ్రం చేసింది. దీన్ని కట్టడి చేయడమో.. లేదా తెగదెంపులు చేసుకోవాలనో.. మామ చంద్రబాబు చేస్తున్న యోచనగా జూనియర్ ఎన్టీఆర్ వర్గీయులు భావిస్తున్నారు. కొంత కాలంగా మాజీ ఎంపీ హరికృష్ణను చంద్రబాబు దూరంగా పెడుతున్నారు. తండ్రి హరికృష్ణకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడాన్ని జూనియర్ ఎన్టీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అనే విషయాన్ని బాబు 2009 నాటికే గుర్తించారు. 2009 ఎన్నికల్లో జూనియర్ చేత ప్రచారం చేయించారు.

Dammu Brings to Fore Naidu, jr NTR Cold War

ఆయనకు మాస్ ఫాలోయింగ్‌ను మొదట గుర్తించి ఉపయోగించుకొని లబ్ధిపొందింది కూడా చంద్రబాబే. జూనియర్‌ను చెప్పుచేతల్లో పెట్టుకోవడానికే పెళ్లి కూడా బాబే కుదిరించాడన్న ప్రచారం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ స్వతహాగా సొంత వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తాడు. అలాంటి అతణ్ని తన దారిలోకి తెచ్చుకోవాలని, తను చెప్పినట్లు వినేవాడిలా చేసుకోవాలని ప్రయత్నించిన బాబు.. ఎక్కడ తనకు ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తాడోననే భయంతో అణిచివేయాలని కుట్ర పన్నాడని జూనియర్ వర్గీలు భావిస్తున్నట్లు సమాచారం.ఒక దశలో చంద్రబాబు తర్వాత టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ వారసుడన్న చర్చా జరిగింది. అవకాశం కోసం చూసిన బాబు మొదట హరికృష్ణకు రాజ్యసభ సీటు నిరాకరించారు. ‘దమ్ము’ ఆడియో రిలీజ్‌కు కావాలనే రాలేదని, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు సృష్టించారన్న చర్చ ఆయన అభిమానుల్లో జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమా బాగా లేదంటూ ప్రచారం చేస్తూ, సినిమా రంగంలో కూడా జూనియర్‌ను కట్టడి చేయాలని బాబు స్కెచ్ వేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను పార్టీ వీడటంలేదని వల్లభనేని వంశీ వివరణ ఇచ్చినా టీడీపీ నేతలు పట్టించుకోవడంలేదని, అతనిపై వేటు వేయడానికి పార్టీ సిద్ధమైందన్న ఆరోపణ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No marriage
Osama bin laden  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles