Osama bin laden

Osama bin Laden,Osama bin Mohammed bin Awad bin Laden was born in Riyadh, Saudi Arabia, a son of Mohammed bin Awad bin Laden,

Osama bin Laden

Osama.gif

Posted: 05/04/2012 11:43 AM IST
Osama bin laden

Osama_bin_Laden

అది 2010 వేసవి. బాగా పొద్దుపోయింది. పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్ ప్రాంతం. పది పన్నెండు మంది స్థానిక గిరిజనులు  మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎవరో ఒక పెద్ద నాయకుడు విందుకు రానున్నాడని తెలుసు. కానీ.. ఆయన ఎవరనేది తెలియదు. ఒక కీలక వ్యక్తి రాబోతున్నాడని వారికి కొన్ని వారాల ముందే సమాచారం అందింది. ఆ అతిథి సరిగ్గా ఎన్ని గంటలకు వచ్చేది కొద్ది సమయం ముందు మాత్రమే వారికి తెలిసింది. రాత్రి 11 గంటలైంది. వారి చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం నిద్రపోతున్నవేళ. వాహనాలు వస్తున్న చప్పుడు. ఓ డజను పెద్ద పెద్ద జీపులు కాంపౌండ్‌లోకి ప్రవేశించాయి. అవన్నీ వేరువేరు దిక్కుల నుంచి వచ్చాయి.

Osama bin Laden

అందులో ఒక వాహనం నేరుగా వరండా సమీపానికి వచ్చింది. వెనుక సీట్లో నుంచి ఒక పొడవాటి వ్యక్తి. తెల్లటి తలపాగాతో, వేలాడుతున్న వస్త్రాలతో దిగాడు. అప్పటికి గానీ వారికి అర్థం కాలేదు. తాము ఇప్పటిదాకా ఎదురు చూసింది ప్రపంచంలో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోసమేనని! ఆ సమయంలో తాము స్థాణువులై నిలుచుండిపోయామని ఆనాటి విందులో పాల్గొన్న ఒక వృద్ధుడు గుర్తు చేసుకున్నాడు.  కొద్దిసేపు వాహనం వద్దే నిలబడి అందరితో కరచాలనం చేసిన లాడెన్ తాను కలిశానని, అయన చేతిని ముద్దాడానని తెలిపాడు. కాసేపటికి తన అనుచరులతో కలిసి లోపలికి వెళ్లాడని, ఆయన వెంట స్థానికులెవరూ లోపలికి వెళ్లలేదని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఇది సరిగ్గా లాడెన్ మరణానికి ఏడాది ముందు జరిగిందని పేరు రాయడానికి ఇష్టపడని ఆ వ్యక్తి తెలిపాడు. ఆ సమయంలో అతిథుపూవ్వరినీ కాంపౌండ్ దాటి బయటకు వెళ్లనీయలేదని, సాయుధులు ప్రధాన ద్వారం వద్ద పహారా కాశారని ఆయన పేర్కొన్నారు. విందు ముగిసిన తర్వాత ఆ జీపులన్నీ ఒక్కోటీ ఒక్కో దిక్కుకు వెళ్లిపోయాయని తెలిపాడు. లాడెన్ ఏ వాహనంలో వెళ్లాడో గుర్తించలేనంత వేగంగా అవి వెళ్లిపోయాయని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dammu brings to fore naidu jr ntr cold war
Pakistanes love  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles