Telangana congress mps take a decision

telangana congress mp's take a decision

telangana congress mp's take a decision

14.gif

Posted: 05/02/2012 02:29 PM IST
Telangana congress mps take a decision

       సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యందో టీ కాంగీ నేతలకు భవిష్కత్తు సాక్షాత్కరిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం లోక్ సభను బహిష్కిరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. 2009లో పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనను అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని వారు చెప్పారు.t_conf తెలంగాణ ప్రాంతంలోని ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా తమతమ పార్టీ జెండాలను ప్రక్కనపెట్టి తెలంగాణ కోసం కలిసి రావాలని ఎంపీలు పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశరావు నివాసంలో ఎంపీలు భేటీ అయ్యారు. లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలు చర్చించారు
      అంతా కలిసి వస్తే రాష్ట్రపతి ఎదుట పరేడ్ నిర్వహించాలని అనుకుంటున్నామనీ, అందుకు తాము బాధ్యత వహించి ముందు ఉంటామని ప్రకటించారు. అయితే కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు రావడం లేదని అన్నారు. అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు వెళితేనే తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. పార్లమెంటులో టి.ఎంపీల ఆందోళన నేపధ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఎంపీలను బుజ్జగించే పనిలోపడింది. మరోవైపు తెరాస ఎంపీలు కేసీఆర్, విజయశాంతిలతో వాయిలార్ రవి సమావేశమయ్యారు. సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మరోవైపు గులాంనబీ ఆజాద్ బుధవారం సాయంత్రం 7 గంటలకు టి. ఎంపీలతో సమావేశం కానున్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijay sai will come into politics
Surprising information coming from bhanu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles