Karthik reddysays i dont know who is bhanu

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Sabitha Indra Reddy's son Karthik Reddy said, he don't know who is Bhanu Kiran and clarified he was net met before. Karthik blamed Telugudesam Party Nara Chandrababu Naidu for targetting him. He was participated in marriage at Tandur on wednesday.

karthik reddysays i dont know who is bhanu.gif

Posted: 04/26/2012 01:10 PM IST
Karthik reddysays i dont know who is bhanu

Kartik-reddyమద్దెల చెఱువు సూరి హత్య కేసులో ప్రధాన నిందుతుడు భాను కిరణ్ తో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు సంబంధం ఉందని, వారిద్దరి కలిసి అనేక చోట్ల భూ దందాలు చేశారని అనేక రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై హోమంత్రి సబితా కూడా వివరణ ఇచ్చారు. తన కొడుక్కి సంబంధం ఉంటే వెంటనే సీఐడీ విచారణ చేపిస్తానని కూడా అన్నారు. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు పదే పదే గొగ్గోలు పెడూతూ ఉన్నాడు. ఈ విషయం పై ఓ పెళ్ళికి హాజరైన హోంమంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డి స్పందించారు.

భాను ఎవరో తనకు తెలియదని, అతడిని ఎక్కడా కలవలేదని హోంమంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చెప్పారు. సూరి హత్యతో తనకు లింకేంటని ఆయన ప్రశ్నించారు. సూరి, భానులలో ఎవరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కాదని, వారితో తనకు పరిచయం కూడా లేదని అన్నారు.  ఈ కేసులో తనకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని సీనియర్ పోలీసు అధికారి రమణమూర్తి ఇప్పటికే తేల్చిచెప్పారని కార్తీక్‌రెడ్డి గుర్తు చేశారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ తనను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cs lays foundation stone for hyderabad metro rail
Ysr congress party president jagan new words abt his photo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles