Tdp leader chandrababu naidu reaction on bhanu arrest

tdp leader chandrababu naidu reaction on bhanu arrest

tdp leader chandrababu naidu reaction on bhanu arrest

11.gif

Posted: 04/22/2012 12:45 PM IST
Tdp leader chandrababu naidu reaction on bhanu arrest

               babu11మద్దెలచెరువు సూరి హత్య కేసులో పట్టుబడిన భాను కిరణ్‌తో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారులకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు."భాను కిరణ్ వ్యవహారాల్లో హోం మంత్రి ప్రమేయం ఉంది. ఆమె కుమారులు భానుతో కలిసి బలవంతపు సెటిల్మెంట్లు, వసూళ్లకు పాల్పడ్డారు. వాళ్ల సంబంధాలపై అనేక ఆరోపణలున్నాయి. విజయవాడలో ఒక ఫ్యాక్టరీని కూడా వీళ్లు స్వాధీనం చేసుకొన్నారని వార్తలు వచ్చాయి. నేరగాళ్లను పట్టుకోవడంతో సరిపోదు. అతనికి ఎవరెవరితో ఎలాంటి సంబంధాలున్నాయి.. ఏమేం చేశారు.. ఎలాంటి వ్యవహారాలు నడిపించారన్నది నిష్పాక్షికంగా విచారణ జరపాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
            సూరి హత్య తర్వాత 14 నెలలకు భానును పట్టుకోగలిగారని, కనీసం ప్రాణాలతో పట్టుకోవడం పెద్ద ఘనతేనని చెప్పారు."పరిటాల రవి హత్య కేసుతో సంబంధాలు ఉన్నవారంతా ఒకరి తర్వాత మరొకరు హత్యకు గురయ్యారు. మొదట ఒక వైద్యునితో మొదలైన హత్యల పరంపర మొద్దు శీనుతో కొనసాగి మద్దెల చెరువు సూరి వరకూ వచ్చింది. భాను కూడా హత్యకు గురయ్యాడని కొంత కాలం కిందట ప్రచారం జరిగింది. పరిటాల హత్య కేసులో ఆధారాలు లేకుండా చేయడానికి ఇలా వరుస హత్యలకు పాల్పడ్డారు. చివరకు జైల్లో కూడా హత్యలు జరిగాయి'' అని చంద్రబాబు పెదవివిరిచారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maddela cheruvu soori wife bhanumati reaction
Bhanu kiran dealings with producers singanamala ramesh and c kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles