Mcd results not a referendum on me sheila dikshit

MCD results not a referendum on me: Sheila Dikshit,Sheila Dikshit, MCD elections, MCD poll results, MCD, Delhi, Congress

MCD results not a referendum on me: Sheila Dikshit

Sheila.gif

Posted: 04/19/2012 10:40 AM IST
Mcd results not a referendum on me sheila dikshit

MCD results not a referendum on me: Sheila Dikshit

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కోటీశ్వరురాలు. ఎన్నికల అఫిడవిట్‌లోనే తన ఆస్తి రూ.112 కోట్లు అని ఆమె ప్రకటించారు. అవినీతి కాంగ్రెస్‌కు తామే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజలు భావించారని, ఈ ఎన్నికలు దేశ రాజధానిలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలకు నిదర్శనమని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గాలి మళ్లీ వీచింది. ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎత్తులను చిత్తు చేస్తూ అక్కడ కాషాయ జెండా ఎగుర వేయించారు. 2007 సంవత్సరంలో ఢిల్లీ మున్సిపాలిటీని బిజెపి గెలుపొందింది. దాంతో ఈసారి ఎలాగైనా అక్కడ తమ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో షీలా దీక్షిత్ పట్టు బట్టి ఢిల్లీని మూడు మున్సిపాలిటీలుగా విభజించింది.

MCD results not a referendum on me: Sheila Dikshit

మూడుగా విభజిస్తే కనీసం ఒక్క స్థానమైనా గెలుపొందవచ్చునని భావించింది. అయితే ఆమె ఎత్తులు పారలేదు. షీలా విభజన తంత్రం బెడిసి కొట్టింది. మూడు స్థానాలలోనూ బిజెపి కాషాయ జెండా ఎగుర వేసింది. రెండు స్థానాలలో స్పష్టమైన మెజార్టీ దక్కించుకోగా మరో స్థానంలో ముందంజలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కలుపుకొని అక్కడ బిజెపియే మేయర్ స్థానాన్ని చేజిక్కించుకోనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బిజెపి ఘన విజయం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. వాస్తవానికి, ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన షీలా 14 ఏళ్లుగా ఢిల్లీని ఏలుతున్నారు. అయితే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం బిజెపి పట్టు కొనసాగుతోంది. అయితే బిజెపికి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గినా మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ బిజెపియే తన హవా కొనసాగించింది. ఢిల్లీ ఉత్తరం, ఢిల్లీ తూర్పు కార్పొరేషన్లలో పూర్తి మెజారిటీ సాధించగా ఢిల్లీ దక్షిణం కార్పొరేషన్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha will bite in by election
Uttar pradesh jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles