Mla anam vivekananda reddy driven riskhagif

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Potti Sriramulu Nellore district rural MLA Anam Vivekananda Reddy driven Riskha on Monday in Praja Patham. Singavaram village of Kurnool district people obstructed minister Pratap Reddy for late YS Rajasekhar Reddy photo

MLA Anam Vivekananda Reddy driven Riskha.gif

Posted: 04/17/2012 06:55 PM IST
Mla anam vivekananda reddy driven riskhagif

Anam-vivekananda-reddyరాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకోవడానికి అప్పుడప్పుడు పగటి వేషాలు వేస్తుంటారు. ఈ పగటి వేషాలు వేసే ఎమ్మెల్యేల్లో ముందుండేది నెల్లూరు జిల్లాకి చెందిన ఆనం వివేకానందరెడ్డి. గతంలో ఎన్నో వేశాలు వేసి వార్తల్లో నిలిచిన ఆనం ఈరోజు మరో కొత్త వేషం వేశారు. మొదటి రోజు ఖాకీ చొక్కా ప్యాంటు వేసుకొని బైక్ ఎక్కి మరి అందరిచేత లంకె పెట్టించారు. నేడు రిక్షావాడు గా మారారు. నెల్లూరులో జరిగిన ప్రజాపథంలో పాల్గొని, ప్రజలను ఆకర్షించేందుకు రిక్షా ఎక్కి తొక్కి హడావుడి చేశారు. ప్రభుత్వ కార్యక్రమం ప్రజాపథంలో ఆనం రిక్షాతో విన్యాసాలు చేయడంతో కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యపోయారు.

ఆనం వివేకానంద రెడ్డికి మరో శాసనసభ్యుడు శ్రీధర కృష్ణా రెడ్డి కూడా తోడయ్యారు. ఆనం రిక్షా ఎక్కి ఎంజాయ్ చేస్తుండగా శ్రీధర కూడా మరో రిక్షా తీసుకొని ఎక్కి తొక్కాడు. అయితే ప్రజాపథం కార్యక్రమానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు ఇద్దరు ఎమ్మెల్యేలు రిక్షాతో స్టంట్స్ చేయడం గమనించి చెవులు కొరుక్కున్నారు. మరి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ఎమ్మెల్యే ఇలా పగటి వేషాలు వేయడం ఏంటని అక్కడ కొందరు అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beef festival turns violent in osmania university
Dont marry or talk to cpm memberstmc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles