Dont marry or talk to cpm memberstmc

Trinamool Congress, mamata benarjee, CPM, Marriage, Tea shop, relations,

The Trinamool Congress has asked its members not to marry any CPM leader or anyone even distantly related to them.

Dont marry or talk to CPM members_TMC.gif

Posted: 04/17/2012 06:19 PM IST
Dont marry or talk to cpm memberstmc

Mamathaతృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక తన అంతరంగాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. మొన్నటికి మొన్న ఆంగ్ల మీడియాపై మమతా బెనర్జీ కన్నెర్ర జేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరూ కూడా అన్ని పేపర్లు చదవద్దని, తాము సూచించిన వాటిని మాత్రమే చదవాలని కొద్ది రోజుల క్రితం సూచించిన విషయం తెలిసిందే.

తరువాత తన పై వివాదాస్పద కార్టూన్లు వేసినందుకు ఓ ప్రొఫెసర్ ను కూడా అరెస్ట్ చేసింది. దాని పై బెంగాల్ లో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లు వెత్తుతున్నాయి. అది కాకుండా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన పేస్ బుక్ పై కూడా తన కొరడాను ఝుళిపించింది. ఫేస్ బుక్‌లో తమకు వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్లపై దృష్టి సారించి, వాటిని వెంటనే తొలగించాలంటూ సిఐడి అధికారులు నిర్వాహకులకు లేఖ రాశారు. ఆ కార్టూన్లను ఏ ఐపి నుంచి పంపారో కూడా తెలియజేయాలని అడిగారు.

ఈ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్  సంచలన ప్రకటన చేశారు. సిపిఎం నేతలను, కార్యకర్తలను, వారి కుటుంబాలలోని వ్యక్తులను పెళ్లాడవద్దని, ఇప్పటికే సిపిఎం కార్యకర్తలతో కుటుంబ సంబంధాలు ఉంటే తెంచుకోవాలని సూచించారు. అంతేకాదు వారు బయట కనిపించినా మాట్లాడవద్దని చెప్పారు. టీ దుకాణంలో కనిపించినా మాట్లాడ వద్దన్నారు. అయితే ఓ మంత్రిగా ఉండి ఇలా వివక్షాపూరితంగా మాట్లాడటాన్ని ముక్తకంఠంతో అందరూ ఖండించారు. తృణమూలు నేతలకు పిచ్చి పట్టినట్లు ఉందని సిపిఎం నేతలు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla anam vivekananda reddy driven riskhagif
Refusal to sex a ground for divorce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles