Obama s security staff sent home for misconduct

Obama’s security staff sent home for ‘misconduct,white house,The situation,Secret Service agents,secret service,Obama,Colombia,Cartagena,Barack Obama

Obama’s security staff sent home for ‘misconduct

security1.gif

Posted: 04/16/2012 10:22 AM IST
Obama s security staff sent home for misconduct

Obama’s security staff sent home for ‘misconduct

దేశాధ్యక్షుడిని కంటికి రెప్పలా కాపాడే వీళ్లు ఈ స్కాంలో ఇరుక్కోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత భద్రతా సిబ్బంది వ్యభిచార కుంభకోణంలో చిక్కుకున్నారు. సుమారు పన్నెండు మంది సీక్రెట్ ఏజెంట్స్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డేగ కళ్లతో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ పరికిస్తూ ఏ మూల ఏ ముప్పు పొంచి ఉందోనని గమనిస్తూ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇప్పుడు ఇందులో ఇరుక్కుంది. వాళ్లు తన వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారని ఓ మహిళ కార్టాజెనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒబామా ఈ వారాంతంలో కొలంబియాలో పర్యటించాల్సి ఉండగా ఆ ఏర్పాట్లు చూసేందుకు ముందుగానే వచ్చిన గార్డుల్లో 12 మంది ఇందులో ఉన్నారు.

అమెరికా బృందానికి చెందిన సభ్యులతో పాటు మీడియా కూడా ఉంటున్న కార్బీ హోటల్లోని తమ గదికి ఈ గార్డులు వ్యభిచారిణులను తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. అయితే, కేవలం ఒక్క ఏజెంటే తన గదికి వ్యభిచారిణిని తెచ్చుకున్నట్లు మరో కథనం ఉంది.
అయినా ఆ బృందంలోని మొత్తం గార్డులందరినీ వెనక్కి పిలిచి విచారించాలని సీక్రెట్ సర్వీసెస్ అధిపతులు నిర్ణయించారు. కొలంబియాలో వ్యభిచారం చట్టబద్ధమే అయినా, ఆ వ్యాపారమంతా డ్రగ్స్ వ్యాపారులు, నేరస్తులతో కలగలిసి ఉంది. దీంతో పన్నెండు మంది గార్డులను ఇళ్లకు పంపేశారు.

Obama’s security staff sent home for ‘misconduct

ఇప్పటికే కొత్త ఏజెంట్లను కొలంబియాకు పంపినందున ఒబామాకు వచ్చిన ముప్పేమీ లేదని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. కానీ, శుక్రవారం సాయంత్రం రెండు చోట్ల నాటుబాంబులు పేలడం, రాజధాని బొగోటాలో మరో రెండు పేలుళ్లు సంభవించడంతో.. భద్రత అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students clash in osmania university over beef fest
Drug rocket in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles