Drug rocket in hyderabad

drug rocket in hyderabad

drug rocket in hyderabad

333.gif

Posted: 04/15/2012 08:01 PM IST
Drug rocket in hyderabad

              రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కొత్త డ్రగ్స్ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా ముఠాలు తమపని తాము కానిచ్చుకుంటున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కొత్తతరహా డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. షిర్డీసాయి అపార్ట్ మెంట్ లో పేరు మోసిన కంపెనీలు తయారు చేసిన మందులను పేరు మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
               ఈ ఘటనలో పెరూ, స్పెయిన్ దేశాలకు పంపేందుకు సిద్ధం చేసిన దాదాపు 50 లక్షల రూపాయల విలువైన అల్ క్లేవ్ యాంటీబయాటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులను అల్ క్లేవ్ ల్యాబొరేటరీ నుంచి కొనుగోలు చేసిన నిందితులు మాత్రలపై వివరాలు మార్చి అల్ క్లేవ్ ఎఫ్ సీ పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. పెరూ, స్పెయిన్ లో అల్ క్లేవ్ యాంటీబయాటిక్ మందులకు విపరీతమైన డిమాండ్ వుండటంతో నిందితులు ఈ మార్గాన్ని ఎంచుకొన్నారని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చెప్పారు. వీటిద్వారా 2 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ వ్యవహారాలు కట్టలు తెంచుకుంటున్నాయనేందుకు ఇది మరో ఉదాహరణ.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama s security staff sent home for misconduct
Ntr and pawan kalyan fans dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles