Film actor mohan babu re entry into politics

film actor mohan babu re entry into politics

film actor mohan babu re entry into politics

13.gif

Posted: 04/15/2012 01:11 PM IST
Film actor mohan babu re entry into politics

              ప్రముఖ నటుడు మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును వివరిస్తానని ఆయన చెప్పారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆయన తిరుమల విచ్చేశారు. ఈ తెల్లవారుజామున నైవేద్య విరామసమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
               plliti_cal_innnఈ సందర్భంగా రాజకీయాల్లో రీ ఎంట్రీ విషయమై మీడియాతో ముచ్చటించారు.  ఏ పార్టీలో చేరుతున్నదీ త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు తనకు ఎన్నో ఏళ్లుగా సన్నిహితుడనీ, ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయనీ మోహన్ బాబు చెప్పారు. అన్నా హజారే స్ఫూర్తితో తాను ముందుకు సాగుతానని చెప్పారు.  అన్నాహజారే ఆశయాలకు అనుగుణంగా అవినీతిపై తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానన్నారు.
              ఇదిలా ఉంచితే, మోహన్ బాబు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు మరోపక్క ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఏమైనా, మోహన్ బాబు రాజకీయాల్లో వున్నా, బయట వున్నా ఆయనెప్పుడూ సంచలనాలకు మారుపేరే అన్నది నిర్వవాదాంశం.
           ఇదిలా ఉంటే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ఎంపీ పదవిని అలంకరించి ముందుకుసాగుతూ రాష్ట్రరాజకీయాల్లో కీలక నేతగా మారుతోన్న మెగాస్టార్ చిరంజీవిని చూసే, మోహన్ బాబు మళ్లీ రాజకీయాల బాట పట్టారని రాజకీయ విశ్లేషకుల భావన. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మోహన్ బాబును తిరిగి పార్టీలోకి రావాలని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది.  అంతేకాదు చిరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి, ఆపార్టీకి ప్రత్యర్థి పక్షమైన తెలుగుదేశంలో ఈ ‘పొలిటికల్ రైడీ’ చేరబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్ట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy says
Mega power star ram charan tej upasana marriage date and time fixed in a few seconds back  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles