Cm kiran kumar reddy says

cm kiran kumar reddy says...

cm kiran kumar reddy says...

8.1.gif

Posted: 04/15/2012 02:37 PM IST
Cm kiran kumar reddy says

              cm_kiran_inn11ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ రాష్ట్ర రాజకీయాలు, పరిస్థితులపై ఓ నిట్టూర్పు వదిలారు.  విశాఖ జిల్లాలోని నక్కపల్లిలో ఆయన ‘ప్రజాపథం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను సీఎం అయిన ముహుర్తం బాగలేదనుకుంటానని, ఏదో ఒక సమస్య ఎదురవుతుందని పేర్కొన్నారు. మీతో పాలుపంచుకునేందుకే ‘ప్రజాపథం’ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
               వేసవిలో తాగు నీరు, సాగునీరు, విద్యుత్ కోత సమస్యలు వేధిస్తున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం మహిళలకు రూ. 11,500 కోట్ల రుణాలు మంజూరు చేస్తామన్నారు. 104లో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే, త్వరలోనే సమస్యలను పరిష్కారిస్తామనీ సీఎం హామీచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి అదనంగా రేషన్‌కార్డులు జారీ చేశామని తెలిపారు..
            ఉపఎన్నికల వేళ ఆయన ఎన్నికల వరాలు ప్రకటించారు. మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 30 పడకల ఆస్పత్రిని 50 పడకలకు పెంచుతామన్నారు. 3 నెలలకోసారి ఉపఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం శోచనియమన్నారు. మరో 2 రోజుల్లో పోలవరంపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader chandrababu naidu appeal to come
Film actor mohan babu re entry into politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles